Sunday, December 1, 2013

1.ఈశావాస్యోపనిషత్తు :


ఓం నమో ప్రమత్మాయే నమః 

ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్,
తేన త్యక్తేన భుఇజ్ఞధా మాగృధః కస్య స్విద్దనమ్ |
ఈ చరాచర ప్రపంచమంతయు పరమేస్వరునిచే (పరమాత్మచే) వ్యాపించబడింది.త్యాగభావముతో అనుభవింపుము. ఇతరుల ధనాదులను కొరకుము.
అసుర్యా నామ తే లోకా అన్దేన తమసావృతాః
తాంస్తే ప్రేత్యాభిగచ్చన్తియే కే చాత్మహనోజనః |
అసుర సంబంధములగు లోకములు అజ్ఞానరూపమున అంధకారముచే వ్యాపింపబడియున్నవి. ఆత్మజ్ఞానము లేనివారు అట్టి అసుర లోకములందే జన్మించుచుందురు.
తదేజతి తన్నెజతి తద్దూరె తద్వాన్తికే ,
తదస్తరస్య సర్యస్య తదు సర్వస్వాస్య బహ్యతః |
ఆత్మ దృశ్య పదార్థరూపమున చలించును. వాస్తవముగా (అధిస్థానదృష్టిచే) చలించదు. అజ్ఞానులకు అది దూరముగా నుండును. జ్ఞానులకు సమీపముగానే యుండును. ఆ యత్మ ఈ సమస్త జగత్తుయోక్క బాహ్యాభ్యంతరములందును గూడ వ్యాపించి యున్నది.
యస్తు సర్వాణి భుతన్యాత్మన్యేవాసుపశ్యుతి,
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే.|
ఎవడు సమస్త ప్రాణులను తన అత్మయందే చూచునో, అట్లే సమస్త ప్రాణులందును తన ఆత్మనే కాంచునో, అట్టివాడు (సర్వాత్మదర్శనము వలన) దేనిని ద్వేషింపడు.
యస్మిన్సర్వాణి భుతన్యాత్మేవాభూద్విజానతః ,
తత్ర కో మోహః కః శోక ఎకత్వమనుపశ్యతః |
ఎవడు సమస్త ప్రాణులను తన అత్మగానే తెలిసికొనునో, అట్టి ఏకత్వానుభూతిచే అతని కింక మోహ మెచట ? శోక మెచట ?
అన్ధం తమః ప్రవిశన్తియే విద్యాముపాసతే |
అవిద్యను ఆశ్రయించువారు అజ్ఞాన మను అంధకారమందే ప్రవేసించుదురు.
విద్యయా మృత మశ్నుతే |
అత్మజ్ఞానముచే మనజుడు అమ్రుతత్వమును (మోక్షమును) బొందుచున్నాడు.
హిరణ్మయేన సాత్రేణ సత్యస్యాపి హితం ముఖమ్ ,
తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ ద్రుష్టయే .|
ఓ పరమాత్మ! బంగారుపాత్రచే (మొహకరములగు పదార్తములచే) సత్యము యొక్క స్వరూపము కప్పబడియున్నది. కాబట్టి సత్య, ధర్మముల సాక్షాత్కారము కొఱకై అద్దానిని (ధనాద్యపేక్షను) తొలగింపుము.
అగ్నే నయ సుపధా రాయే అస్మాన్విశ్వాని దేవ వయునాని విద్వాన్ ,
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టం తే నమ ఉక్తిం విధేమ |
ఓ అగ్నిదేవా! నన్ను సన్మార్గమునకు తీసికొని పొమ్ము. నీవు సమస్త జ్ఞానమునకు, మా కర్మలను తెలిసికొనియున్న వాడవు.మా పాపములను నశింపజేయుము. దానివలన మేము పరిశుద్దులమగుదుము. మేము ణీ యొక్క ఉత్తమ స్తోత్రమును భక్తితో చేయుదుము.

No comments:

Post a Comment