Sunday, December 22, 2013

18. నారాయణోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

నారాయణుడు(పరమాత్మ) నిత్యుడు, బ్రహ్మదేవుడు నారాయణుడే, శివుడు నారాయణుడే, ఇంద్రుడు నారాయణుడే, భూమ్యాకాషములు నారాయణుడే, కాలతత్వము నారాయణుడే, దశాదిక్కులు నారాయణుడే, ఊర్ద్వభాగమున ఉన్నదంతయు నారాయణుడే, అధోభాగమున ఉన్నదంతయు నారాయణుడే, మధ్యభాగమున ఉన్నదంతయు నారాయణుడే, బహ్యాభ్యంతరముల యందున్న దంతయు నారాయణుడే. ఈ సమస్తము నారాయణుడే, భూత భవిష్య ద్వార్తమానము లన్నియు నారాయణుడే, నారాయణుడు. నిష్కలంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, వాక్కుచే నిర్వచింపశక్యము కానివాడు, శుద్దుడు, దేవుడు ,అద్వితీయుడు, అతడు తప్ప మరియొకడు ఎవడును లేడు ఈ ప్రకారముగా తెలిసికొను వాడు విష్ణువే యగు చున్నాడు.
మొదట ఓమ్ అని ఉచ్చరించవలెను. తదుపరి నమో అని ఉచ్చరించవలెను. పిమ్మటనారాయణ అని ఉచ్చరించవలెను. ఇదియే అష్టాక్షర మహామంత్రము. ఎనిమిది ఎనిమిది అక్షరాములుకల ఈ మంత్రమును ఎవడు భక్తీ శ్రద్దలతో, ప్రీతితో, విశ్వాసముతో స్మరణము చేయునో అతడు దీర్ఘాయుస్సు కలవాడగును; ప్రజాపతిత్వమును పొందును. స్వర్గాదిపత్యమును బడయును. ధనదాన్యాది ఐశ్వర్యమును, సంపదను పొందును. ఎవడు దీని నెరుంగునో అతడు అమృతత్వమును (మోక్షమును) బడయుచున్నాడు.
కార, కార, కారములను ఈ మూడక్షరములను కలిపి ఓమ్ అను ప్రణవ మగుచున్నది. ఈ ప్రణవమునకు అర్ధము ప్రత్యగానందస్వరూపమగు పరబ్రహ్మము. ఈ ఓంకారమును అర్ధయుక్తముగా స్మరణచేయు యోగి జనన మరణ రూప సంసారబంధనము నుండి విడివడుచున్నాడు. ఓం నమో నారాయణ అను అష్టాక్షర మంత్రమును ఉపాసించువాడు వైకుంఠలోకమును పొందుచున్నాడు. సర్వవ్యాపకమగు ఆ పరబ్రహ్మ హృదయ పుండరీకమందు విజ్ఞానఘనమై, అంతర్యామిగా, అంతరాత్మగా ప్రకాశించుచున్నది. అది మెరుపువలె ప్రకాశమానమైనది. పరబ్రహ్మ స్వరూపుడగు నారాయణుడు బ్రహ్మన్యుడు. సమస్తప్రాణులయందును ఒక్కడే నారాయణుడు అంతర్యామియై వేలుగొందుచున్నాడు. అతడు సర్వవ్యాపియై ఈ సమస్త ప్రపంచమునకు కారణభూతుడై, తనకు వేరొకకారణమేదియు లేనివాడై వెలయుచున్నాడు.

17. గర్భోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

ఋతుకాలమున సంయోగనంతరము ఒక్కరాత్రియుండెనేని (శుక్ల శోణిత పదార్థము) ముద్ద అగుచున్నది. ఏడురోజులు ఉండినచో బుగ్గ అగుచున్నది. పదునైదు దినములకు పిండమగుచున్నది. ఒక నెలకు గట్టియగుచున్నది. రెండు నెలలకు కాళ్ళు కలుగుచున్నవి. నాలుగు నెలలకు కడుపు, నడుము కలుగుచున్నవి. ఐదవ నెల వెన్నెముక కలుగుచున్నది. ఆరవనెల ముక్కు, కన్నులు, చెవులు కలుగుచున్నవి. ఏడవనెల ప్రాణము కలుగుచున్నది. ఎనిమిదవనెల శరీరముయొక్క అవయవములన్నియు సంపూర్ణముగా కలుగును. తోమ్మిదవనెల సంచరించుచున్నది.
గర్భస్తమగు శిశువు పంచభూతస్వరూపుడును, సమర్దుడును అగుచున్నాడు. పంచేంద్రియాలతో గూడి అతడు గంధరసాధులను ఎరుగుచున్నాడు. మంచి జ్ఞానముచేతను, ధ్యానముచేతను ఓంకారమును ఎరుగుచున్నాడు. పరబ్రహ్మ స్వరూపమైన ఆ ఏకాక్షరమును (ప్రణవమును) తెలిసికొనుచున్నాడు. ఈ శరీరమునందు ఎనిమిది ప్రకృతులను, పదునారు వికారములును కలవు. తొమ్మిదవ నెలయందు అన్ని లక్షణములును పూర్తియగుచున్నవి. అత్తరి జీవుడు తన పూర్వపుజాతిని, పూర్వపుకర్మను, చేయబోవు కర్మను, మంచికర్మను, చెడ్డకర్మను తెలిసికొనుచున్నాడు.
(అప్పుడు గర్భస్థజీవుడు ఈ ప్రకారముగా చింతన చేయుచున్నాడు). నేను అనేక స్త్రీ యోనులను చూచినాను. అనేకములైన్ ఆహారములను భుజించితిని. అనేక స్తనములద్వార క్షీరమును పానము చేసితిని.
నాకు సమస్త భూమియు జన్మభూమియే. సమస్తభూమియు శ్మశానమే. నేను ఎనుబదినాలుగు లక్షల యోనిభేదములందు జన్మించితిని.
ఎన్నియోసార్లు పుట్టితిని, ఎన్నియోసార్లు చచ్చితిని. ఎన్నియోసార్లు సంసారినై యుంటిని. పుట్టుట, చచ్చుట, మరల పుట్టుట, చచ్చుట ఈ ప్రకారముగా నా కాలము గడచిపోయినది.
గర్భావాసము మహాదుఃఖకరమైనది జన్మల నెత్తుటయందలి మోహము మహాదుఃఖకరమైనది. బాల్యమునందు దుఃఖము, శోకము, పరవశత్వము, మూఢత్వము కలుగుచున్నవి.
యౌవనమునందు హితకార్యములు చేయక పోవుటయు, సోమరితనము, ఆహితకార్యముల నాచరించుట, విషయాశక్తి, తాపత్రయముచే బాధింపబడుట సంభవించుచున్నవి.
వార్ధక్యమునందు చింతయు, రోగములు కలుగుచున్నవి. మరణమునందు మహాభాయము కలుగుచున్నది. ఆశచేతను, అభిమానముచేతను అధికమైన కామక్రోధాదుల సంకటమునందు తగుల్కొనుటచేతను, అస్వతంత్రతచేతను మిక్కిలి దుఃఖము కలుగుచున్నది.
జన్మము దుఃఖమునకు కారణమైయున్నది. దుఃఖరూపమైనది. మిగుల సహింపరానిదై యున్నది. నేను నివృత్తి ధర్మమును ఏమియు చేయలేదు. యోగాము యొక్కగాని, జ్ఞానము యొక్కగాని సాధన మేమియు చేయలేదు.
ఆహా! దుఃఖసముద్రమున నేను మునిగియున్నాను. దీనికి ప్రతీకార మేమియు ఎరుగక యున్నాను. అజ్ఞానమునకు మరల మరల దిక్కారమగుగాక!
సంసారమను గోలుసునకు దిక్కరమగుగాక! ఈ గర్భము నుండి బయటకు వచ్చిన పిదప సద్గురువును ఆశ్రయించి జ్ఞానమును బొందదెను. ఈ యోని ద్వారమునుండి వెలువడినచో నేను సాంఖ్యయోగమును లెస్సగ ఆశ్రయించెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, అశుభమును తొలగించువాడను, మోక్షఫలము నొసంగు వాడను అగు మహేశ్వరుని శరణుబొందెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, అశుభమును తొలగించువాడను, పురుషార్ధములు నొసంగువాడను అగు జగదీశ్వరుని శరణుబొందెదను.
ఈ యోని ద్వారమునుండి నేను బయటకు వచ్చినచో, సర్వశక్తిమంతుడును, సర్వకారణములకును కారణభూతమైనవాడును, భర్గుడును, పశుపతియు, రుద్రుడును, మహాదేవుడును, జగద్గురువును అయిన పరమేశ్వరుని శరణుబొందేదను .
ఈ యోని బంధమునుండి వెలువడినచో గొప్పతపస్సు నాచరించెదను.
ఈ గర్భావాసమునుండి బయటకు వచ్చినచో అమృతత్వమును (మోక్షమును) కలుగాజేయువాడును, ఆనందరూపుడును, నారాయానుడును అగు విష్ణువును హృదయ మందు ధ్యానించెదను.
నేనిపుడు తల్లిగర్భమందు బంధింపబడి యున్నాను. ఈబంధనములనుండి విడుదలయైనచో భగవంతుడు వాసుదేవుని అనన్యచిత్తముతో భజించి సంతోషపరచెదను.
పూర్వము నేను ఇతరులకొరకై కర్మలనుచేసితిని. ఇపుడు ఒంటరిగానే బాధింపబడుచున్నాను. ఫలమును బొందినవారందరును వెడలిపోయిరి.
పూర్వము నేను నాస్తికుడనై భయమును వదలి అనేక పాపములను చేసితిని. ఇప్పు డా పాపఫలమును అనుభవించుచున్నాను. ఇక మీదట నేను ఆస్తికుడనై యుండెదను.
ఈ ప్రకారముగా అనేకవిధములైన అనర్ధములను గురించి మాటి మాటికి చిన్తనచేసి, జనన మరణరూప సంసారదుఖమును పలుమార్లు సంస్మరించి గర్భామునందలి జీవుడు వైరాగ్యమునుబొంది అజ్ఞానము, కామము, కర్మము మున్నగువానిచే మోహము నొందుచున్నాడు.
ఆ జీవుడు వందలకొలది స్త్రీల యోనిద్వారములను పొందియున్నాడు. ఇపుడు ఆ యోని ద్వారమునుండి విడుదల పొందుటకు ప్రయత్నించుచున్నాడు. అట్లు విడుదలపొందుటకు ప్రయత్నించుచున్నాడు. అట్లు విడుదలపొందుటకు శక్తిలేనివాడై యంత్రము నందు తగుల్కొనినట్లు పీడింపబడుచున్నాడు. దుఃఖాతి శయముచే క్లేశము నొందుచున్నాడు. ప్రసవవాయువుచేత పీడింపబడుచున్నాడు. జనన మొందిన వెంటనే అతడు వైష్ణవ వాయువుచే వ్యాపింపబడుచున్నాడు. అత్తరి అతడు పరలోకసాధనను దేనిని స్మరించుటలేదు. అపుడు అపరోక్షజ్ఞానము లేక యుండును.
భూమియొక్క స్పర్శఅయిన వెంటనే జీవుడును క్రూరదృష్టి కల వాడును, పామరుడును అగుచున్నాడు. జలముచే కడుగబడిన తరువాత అతనికి ఆ దృష్టిదోషము తోలగుచున్నది.
జీవుడు పుట్టిన తరువాత అతనికి జననము, మరణము, కర్మము, శుభాశుభ సాధనములు అను ఈ ప్రకారములైన విషయము లెవ్వియును గోచరించుటలేదు. అతనికి వాసనలు అన్నియు నిగూఢములై యుండును.
ఈ శరీరమందు ఎనిమిది కోట్ల రోమములు, ఎనిమిది వందల సంధులు, తొమ్మిదివందల నారములు కలవు. గుండె ఎనిమిదిపలములు, నాలుక పండ్రండు వలములు అన్నియు నశించునవి యని తెలిసికొని గర్భమందలి జీవునివలె సుషుమ్నయందు స్థానముగనుండి వివేకవంతుడై ముని కావలెను. అట్టి జ్ఞాని యిక దేహము నొందుట లేదు.
అట్లుగాక, అజ్ఞానముచే సంసారమును పొందువానికి కీటకమునకువలె నరకముతో సమానమైన ఈ దేహమందు, మూత్రపురీషపానము చేయు దుఃస్థితికలుగును. ఈ తత్వము నేరిగినచో జీవుడు విరక్తిజెందును అని పిప్పలాద మహర్షి చెప్పెను.      

Thursday, December 19, 2013

15. హంసోపనిషత్తు & 16. అరుణికోపనిషత్తు


ఓం నమో పరమాత్మయే నమః 

15. హంసోపనిషత్తు
హంస హంస అని పరమహంస స్వరూపమును (భాగవత్స్వరూపమును) సదా ధ్యానించునట్టియు, ఇంద్రియ నిగ్రహము గలిగినట్టియు, గురుభక్తుడును అగు బ్రహ్మనిష్టునకు జ్ఞానము బోధింపబడుచున్నది.
కొయ్యయందు అగ్నివలెను, నువ్వులందు నూనెవలెను, సమస్త దేహములందును వ్యాపించియున్న పరమాత్మను తెలిసి కొనినవాడు మృత్యువును (జనన మరణములను) పొందడు.
జ్ఞానముచేత మనస్సు లయింపబడగా, మనస్సునందలి సంకల్పవికల్పములు తొలగిపోగా, పుణ్యపాపములు (జ్ఞానాగ్ని చేత) దగ్దములు కాగా, సర్వశక్తిస్వరూపుడును, సర్వత్ర వేలుయుచుండువాడును, స్వయంజ్యోతి స్వరూపుడును, శుద్దుడును, బుద్దుడును, నిత్యుడును, నిరంజనుడును, శాంతుడును అగు సదా శివుడు (పరమాత్మ) ప్రకాశించుచున్నాడు (అనుభూతుడగుచున్నాడు).

16. అరుణికోపనిషత్తు
ఔషదమును స్వీకరించునట్లు భోజనమును (మితముగా) భుజింపవలెను. బ్రహ్మచర్యమును, అహింసను, అపరిగ్రహమును, సత్యమును ప్రయత్న పూర్వకముగా తప్పక రక్షింపవలయును (అవలంబించవలెను).
కామము, క్రోధము, హర్షము, రోషము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఇచ్ఛ, అసూయ, మమత్వము, అహంకారము మున్నగువానిని పరిత్యజించవలెను.

Wednesday, December 11, 2013

14. శ్వేతాశ్వతరోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

పరమాత్మను గూర్చి తెలిసికోనినపుడు సమస్త పాశములనుండి విడినగుచున్నాడు.
పరమాత్మను నెరిగిన యెడల జీవునకు అవిద్యాది పాశములు తొలగిపోయి, క్లేశము క్షయించి జనన మరనాది దుఃఖములు నశించును.                
తనయందున్నట్టి పరమాత్మను ఎల్లప్పుడు తెలిసికోనవలెను. ఎరుంగదగిన వస్తువు దీనికంటె వేరుగ మరేదియును లేదు.         
తన దేహమును క్రిందికట్టేగాను, ఓంకారమును పైకట్టేగను చేసికొని ధ్యానాభ్యాసమను మధనము గావించి నిగూడమైయున్న అత్మదేవుని దర్శించవలయును.
ఆత్మ విద్యకు, తపస్సునకు మూలభూతమైన పరబ్రహ్మమును పాలయందు నేయివలె, సమస్త జగత్తునందును వ్యాపించియున్నట్లు తెలిసికొని జీవుడు బంధరహితుడగుచున్నాడు.
శిరస్సు, కంటము, శరీరము అను ఈ మూడింటిని తిన్నగా నిలిపి, ఇంద్రియములను, మనస్సును హృదయమందు స్థాపించి, బ్రహ్మ మనెడు తెప్పచేత భయావహములైన జననమరనాది సంసారమను ప్రవాహమును జీవుడు దాటవలెను.
చెడ్డ గుర్రములు కల రధమును సారధి బహుజాగరూకుడై నడపించునట్లు, సాధకుడు అప్రమత్తుడై మనస్సును జయించవలయును.                    
యోగాగ్నిమయమైన శరీరము కలవానికి రోగము కాని, వార్ధకము కాని, మరణము కాని ఉండవు.         
యోగాభ్యాసమునందు ప్రవర్తించిన వానికి శరీరము తేలికగా నుండును. ఆరోగ్యవంతముగా నుండును. ఆశలు లేకుండును. శరీరము ప్రకాశమానమై యుండును. కంటధ్వని స్పస్టముగా నుండును.
సాధకుడు అత్మతత్త్వమును దర్శించి అద్వితీయుడును, ధన్యుడును, దుఃఖరహితుడను అగుచున్నాడు.
జన్మరహితమై, నిశ్చలమై, విశుద్దమైనట్టి అత్మదేవుని తెలిసికొని జీవుడు సమస్త పాశములనుండియు విదివడుచున్నాడు.      
ఆ పరమపురుషుని (పరమాత్మను) మహాత్ముడుగను, ప్రకాశస్వరూపుడుగను, తమస్సునకు ఆవలనున్నవాడుగను నేను ఎరుగుచున్నాను. అతని నెరిగి జీవుడు మృత్యువును దాటుచున్నాడు. మోక్షమునకు ఇంతకంటె వేరుమార్గము లేదు.
దీనికంటే శ్రేష్టమైనదికాని, వేరైనదికాని, పెద్దదికాని, చిన్నదికాని ఏదియులేదో, ఏది వ్రుక్షమువలె ఆకశామునందు నిలబడియున్నదో, అట్టి బ్రహ్మముచేత ఈ సమస్త ప్రపంచము పరిపూర్ణమై వ్యాప్తమై యున్నది.
ఈ జగత్తుయోక్క కార్యకారనములకంటే వేరైనదియు, రూపరహితమైనదియు, తాపత్రయవర్జితమైనదియునగు బ్రహ్మమును ఎరింగినవారు మరణరహితులగుచున్నారు. తదితరులు దుఃఖమును పొందుచున్నారు.
ఆ భగవంతుడు సమస్త ప్రాణులయొక్క ముఖములును, శిరస్సులును, కంటములును గలవాడై యున్నాడు. సర్వ జీవుల యొక్క హృదయగుహలందు నివసించుచున్నాడు. అతడు సర్వవ్యాపి, మంగళస్వరూపుడు అయియున్నాడు.
పరమాత్మా అంగుష్టమాత్ర పరిమానముతో హృదయగుహయందు వెలయుచున్నాడు. అతడు పరిపూర్ణుడు, సమస్త ప్రాణుల హృదయములందుండి మనస్సుచే కప్పబడి యున్నాడు. అతడు జ్ఞానమునకు ప్రభువు. ఈ ప్రకార మెరుంగువాడు మరణము లేనివారగుచున్నారు.
ఆ దేవుడు నవద్వారములుకల శరీరమను పట్టణమందు ఆత్మరుపమున వెలయుచు, స్థావరజంగమాత్మకమైన సకల ప్రపంచమును స్వాధీనము చేసుకొని బయటకూడ సంచరించుచున్నాడు.
ప్రకృతి మాయయనియు, ఆ మాయకు అధిపతి ఈశ్వరుడనియు తెలియదగినది. ఆ ఈశ్వరుని యొక్క అవయవరూపములగు పదార్థములచే ఈ జగత్తు వ్యాప్తమై యున్నది.
ఆ ఈశ్వరుడు ప్రక్రుతియగు మాయయందు వశించియున్నాడు. అతడు అద్వితీయుడు; ఈ ప్రపంచమంతయు అతనియందే లయమగుచున్నది. అతడే ముక్తి నొసంగువాడు, స్తుతింపబడువాడు, దేవుడు. అట్టి ఈశ్వరుని బాగుగా విచారించి తెలిసి కొనువాడు పరమ శాంతిని (మోక్షమును) పొందుచున్నాడు.
ఈ ప్రపంచమునందు సుక్ష్మాతిసూక్ష్మమై వెలయువాడును, జగత్తుయొక్క సృష్టికర్తయు, అనేక రూపములు కలవాడును, అద్వితీయుడును, ప్రపంచమంతయు వ్యాపించియున్నవాడును, మంగళస్వరూపుడును అగు పరమేశ్వరుని తెలిసికొని మనుజుడు పరమశాంతిని పొందుచున్నాడు.
ఆ పరమాత్మయే కాలస్వరూపుడును, లోకమును సంరక్షించువాడు, జగత్పరిపాలకుడును, సమస్త ప్రానులందును నిగూఢముగా నున్నవాడును, ఋషులు, దేవతలు ధ్యానించునట్టి దేవదేవుడును అయియున్నాడు. అతని నెరిగి జనులు మృత్యు పాశమును చేధించివేయుచున్నారు.
ఘ్రుతముకంటెను అతి సూక్ష్మమైనవాడును, సమస్తప్రాణులందును నిగుడముగా నున్నవాడును, అద్వయరూపుడును, ప్రపంచమంతయు వ్యాపించియున్నవాడును అగు ఆత్మదేవుని ఎరిగి మనుజుడు సమస్త పాశములనుండియు విడివడుచున్నాడు.

ఎవనికి భగవంతునియందు విశేషభక్తికలదో, అట్లే గురువు నందును కలదో, అట్టి మహాత్మునకు ఉపదేశింపబడిన ఈ బోధలన్నియు చక్కగా ప్రకాశించును. (అనుభవమునకు వచ్చును).

12. కైవల్యోపనిషత్తు:

ఓం నమో పరమాత్మయే నమః 

సాధనచతుస్టయ సంపత్తిని పొందిన తరువాత అశ్వలాయనుడు భగవంతుడైన బ్రహ్మదేవుని యొద్దకు వెళ్లి ఇట్లడిగెను.
మహాత్మా! శ్రేష్టమైనదియు, ఎల్లప్పుడు సజ్జనులచే ఉపాసింప దగినదియు, దేనిచేత జ్ఞాని సమస్త పాపములను పోగొట్టుకొని పరాత్పరుడగు పరమాత్మను పొందునో, అట్టిదియును అగు బ్రహ్మవిద్యను ఉపదేశింపుడు.
అది విని బ్రహ్మదేవుడు అశ్వలాయనకు ఇట్లు బోధించెను. నీవు శ్రద్ధ, భక్తీ, ధ్యానము, యోగము అనువానిద్వారా భగవంతునిని తెలిసికొనుము. కర్మచేతగాని, సంతానముచేతగాని, ధనముచేతగాని మోక్షము కలుగదు. త్యాగమను ఒక్కదాని చేతనే జ్ఞానులు మోక్షమును పొందిరి.
స్వర్గముకంటె శ్రేష్టమైనదియు, హృదయగుహయందు వుండునదియు, ప్రకాశించునదియు అగు ఆ పరబ్రహ్మమును, వేదాంత విజ్ఞానముచే బాగుగా నిశ్చయింపబడియుండు అర్ధమును తెలిసికొనిన వారును, సన్యాసయోగాముచేత శుద్దమైనట్టి అంతఃకరణము కల వారును అగు యతులు పొందుచున్నారు.
ఆ యతులందరును చివరిజన్మయోక్క అంతమందు బ్రహ్మలోకములందు పరమాత్మను పొంది విమక్తులగుచున్నారు (పునర్జన్మ రహితమగు మోక్షమును పొందుచున్నారు).
ఏకాంతప్రదేశమున సుఖాసనస్థుడై, నిర్మలమనస్కుడై, ఇందియములన్నింటిని నిగ్రహించి, హృదయకమలమును రాజోగుణరహితముగను, పరిశుద్దముగను భావించి, ఆ హృదయ కమల మధ్యమున ఉన్న నిర్మలుడును, అగోచరుడను, అనంతరూపుడును, మంగళకరుడును, ప్రశాంతుడును, అమ్రుతస్వరూపుడును, మాయకు కారణభూతుడును, ఆదిమధ్యాంతరహితుడును, అద్వితీయుడును, సర్వవ్యాపియు, చిదానంద స్వరూపుడును, రూపరహితుడును, ఆశ్చర్యకరుడును, ప్రభువును, త్రినేత్రుడును,నీలకంటుడును, శాంతస్వభావుడును అగు పరమేశ్వరుని ధ్యానించి ముని యగువాడు సర్వసాక్షియు, అజ్ఞానమునకు, అన్యమైనదియు, సమస్త ప్రాణులకును, ఆదికారణమైనదియు నగు పరమాత్మను పొందుచున్నాడు.
ఆ పరమాత్మయే బ్రహ్మ దేవుడు, అతడే శివుడు, ఇంద్రుడు, నాశరహితుడు, ఉత్తముడు, స్వయంబప్రభువు, విష్ణువు, ప్రాణము, కాలము, అగ్ని, చంద్రుడు అయి యున్నాడు.
భూత, భావిష్యత్తులయందుండు సమస్తము ఆ పరమాత్మయే. అతడు శాశ్వతుడు. ఆ పరమాత్మను తెలిసికొని జ్ఞానీ మృత్యువును దాటుచున్నాడు. మోక్షమును పొందుటకు ఇంతకంటే వేరగు మార్గము లేదు.
సమస్త ప్రాణులందును తనను, తనయందు సమస్త ప్రాణులను చూచువాడు పరబ్రహ్మను పొందుచున్నాడు. ఇతర కారణములచే పొందుటకు వీలులేదు.
తన మనస్సును క్రింది కట్టేగను, ఓంకారమును పైకట్టేగను చేసికొని జ్ఞానమను మధనము ద్వారా అభ్యాసము ద్వారా జ్ఞాని అజ్ఞానపాశమును దాహించివేయుచున్నాడు.
ఆ పరమాత్మయే (జీవరూపమున) మాయచే మొహింపబడిన అంతఃకరణము కలవాడై, శరీరమును పొంది కార్యములన్నిటిని చేయుచున్నాడు. అతడే జాగ్రుత్తునందు స్త్రీ, అన్నము పానము మొదలైన విచిత్రములగు భోగములచే పరిత్రుప్తిని పొందుచున్నాడు.
ఆ పరమాత్మనుండి ప్రాణము, మనస్సు, సమస్త ఇంద్రియములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, సర్వమును ధరించి యుండు భూమి కలుగుచున్నది.
సర్వస్వరూపియు, ప్రపంచమునకు ముఖ్యస్థానమును, సుక్ష్మముకంటే సూక్ష్మమును అగు పరబ్రహ్మమేది కలది అదియే నీవు. నీవే అది.
జాగ్రుత్తు, స్వప్నము, సుషుప్తి మొదలగు వానియందు ఏ ప్రపంచము గోచరించుచున్నదో, అది బ్రహ్మమే. ఆ బ్రహ్మమే నేను అని తెలిసికోనువాడు సమస్త బంధములనుండి విముక్తుడగును.
మూడు అవస్థలయందును అనుభవింపబడునది, అనుభవించువాడు, అనుభావమగును అనునవి యేచి కలవో వానికంటె విలక్షనమైనవాడను, సాక్షియు, చిన్మాత్రుడను అగు సదాశివుడను నేను.
నా యందే (అత్మయందే) సమస్తము కలుగుచున్నది. నా యందే సమస్తము లయించుచున్నది. అట్టి అద్వయ బ్రహ్మమునే నేను అయియున్నాను.
నేను అణువుకంటేను సూక్ష్మముగను, మహత్తుకంటేను మహత్తరమై వున్నాను. విచిత్రమైన ఈ ప్రపంచము నేనే. పురాతన స్వరూపుడను నేనే. ఈశ్వరుడను నేనే. నేను జ్యోతిస్వరూపుడను, మంగళరూపుడను అయియున్నాను.
అనేక వేదములచే తెలియబడువాడను నేనే. వేదాంత ప్రవక్తుడను నేనే. వేదవేద్యుడను నేనే. నాకు పుణ్యపాపములు లేవు. నాకు నాశము లేదు. నాకు జన్మము, దేహము, ఇంద్రియములు, బుద్ధి ఇవి ఎవియు లేవు.
నాకు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు లేవు. హృదయగుహయందున్నదియు, రూపరహీతమైనదియు, అద్వితీయమైనదియు, సమస్తమునకు సాక్షియు, సత్తు, అసత్తులేనిదియు, పరిశుద్దమైనదియు నగు పరమాత్మ స్వరూపమును తెలిసికొని జీవుడు అట్టి పరమాత్మా స్వరూపమును పొందుచున్నాడు.

కాబట్టి ఈ పరమాత్మను తెలిసికొని జీవుడు సంసార సముద్రమును నశింపజేయునట్టి జ్ఞానమును పొందుచున్నాడు. దానిచే మోక్షమును బడయుచున్నాడు. శాశ్వత సుఖమును పొందుచున్నాడు.

11.బ్రాహ్మొపనిషత్తు:

ఓం నమో పరమాత్మయే నమః 

నాశరహితమగు పరబ్రహ్మమేది కలదో దానిని యజ్ఞోనముగా ధరించవలెను.
ఈ ప్రపంచమంతయు దారమునండు మణులవలె దేనితో గ్రుచ్చబడియున్నదో, అట్టి బ్రహ్మ సూత్రమును యోగవేత్తయు, పరబ్రహ్మ తత్వము తెలిసినట్టియు నగు యోగి ధరించును.  
అద్వితీయుడును, స్వయంప్రకాశుడును అగు పరమాత్మా సమస్త ప్రాణులందును నిగూడముగా నున్నవాడును, సర్వ వ్యాపకుడను, సర్వ భుతాంతర్వర్తియగు ఆత్మస్వరూపమును, సర్వాధ్యక్షుడును, సర్వ ప్రాణులందును అధినసించి యున్నవాడును సాక్షియు, చైతన్యరూపుడును, నిర్గుణుడును అయియున్నాడు.
అద్వితీయుడును, సమస్తమును స్వాదీనపరుచుకొనియుండు వాడును, సర్వభుతాంతరాత్మయు అగు ఏ పరమాత్మా ఒక్క రూపమునే అనేక రూపములుగా చేయునో, అట్టి హృదయమునందుండు పరమాత్మను ఏ ధీరులు దర్శించుడురో వారికే శాశ్వతమగు శాంతి లభించును గాని తదితరులకు కాదు.
మనస్సును క్రిందికట్టెగను, ఓంకారమును పైకట్టెగను చేసి, ధ్యానాభ్యాసమున మధనమున గావించి నిగూడముగనున్న ఆత్మ దేవుణ్ణి దర్శించవలయును.
నువ్వులయండు నూనెవలెను, పెరుగులో వెన్నవలెను, ప్రవాహమునందు జలమువలెను, కొయ్యలందు అగ్నివలెను ఆత్మా అంతఃకరణమున నిగుడముగా నున్నది. సత్యము చేతను, తపస్సు చేతను, ధ్యానాభ్యాసము చేతను అట్టి ఆత్మస్వరూపమును మనుజుడు సాక్షాత్కరించుకోనవలెను.
వాక్కు, మనస్సు, ఏ పరబ్రహ్మమును చేరలేక వెనుకకు మరలుచున్నవో, విజ్ఞుడు దేనిని తెలిసికొని ముక్తుడగుచున్నాడో, అదియే జీవుని పరమాస్థి ఆనందము.

బ్రహ్మవిద్య జ్ఞాన తపస్సులే మూలముగాగల పరమాత్మను పాలయందు నేయివలె సర్వవ్యాపిగా బ్రహ్మవేత్తలు తెలిసికొనుచున్నారు.    

10.బృహదారణ్యకోపనిషత్తు:

ఓం నమో పరమాత్మయే నమః 

అసతో మా సద్గమయ – అసత్తునుండి సత్తునకు గొనిపొమ్ము.
తమసో మా జ్యోతిర్గమయ – తమస్సునుండి జ్యోతిలోనికి తీసికొని పొమ్ము.        
మృత్యోర్మా మమృతం గమయ – మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము..
ఆత్మై వేద మగ్ర ఆసీత్ దేవ ఏవ ... సృష్టికి పూర్వం ఆత్మ ఒకటియే కలదు అంటే ఆదియందు (మొదట) ఆత్మ ఒకటియే కలదు.         
ద్వితీయద్వై భయం భపతి : రెండవ వస్తువు కాని వ్యక్తీకాని యున్నచో భయం కలుగును. (ఆత్మ తప్ప మరియొక వస్తువుకాని, వ్యక్తికాని ఈ ప్రపంచమున లేనందున ఇంక భయమేల కలుగును? కలుగదని భావము.)
ఆత్మ మిక్కిలి ప్రియమైనది. పుత్రునికంటేను, ధనముకంటెను, ఇంకను ఏయే పదార్థములు శ్రేష్టములైనవి కలవో వానికంటేను ఆత్మ ఎంతో ప్రియమైనది. ఆత్మ మన సమీపమందే మన స్వరూపమైయే యున్నది. అనాత్మను ప్రియమణి చెప్పు మనుజునకు, అత్మగ్నని అయ్యా! మీరు ప్రియమణి తలంచు పుత్రాదులు నశించునవి కదా! అని చెప్పెను. ఈ సత్యమును తెలుపుటకు అతడోకడే సమర్ధుడు. అనాత్మరూపమైన దానికి అస్తిత్వము లేదు. అవిద్యచే వున్నట్లు కన్పించును. కావున ఆత్మ యను ప్రియవస్తువునే ఉపాసించవలయును. ఆత్మను ప్రియమని ఉపాసించువాని ఆనందము ఎప్పటికిని నశించదు.
సృష్టికి పూర్వము ఈ  ప్రపంచము బ్రహ్మముగా నుండెను. బ్రహ్మము నేనే బ్రహ్మమునై యున్నాను అని తలంచెను. కావున అది సమస్తమును అయినది.
ఎవడు తన అత్మకంటే వేరైనా దేవత కలదనియు, అది వేరు, తానూ వేరు అనియు భావించి అన్యదేవతోపాసన చేయుచున్నాడో అతడు అవివేకి.
ఎవడీ ప్రపంచమున తన స్వరూపమే అయియున్న ఆత్మ నెరుగక మృతినొందునో, అతనిని ఆత్మ (బ్రహ్మము) రక్షింపదు.అధ్యయనము చేయబడని వేదము మనుజుని రక్షింపనట్లు ఆత్మ అతనిని రక్షింపదు. కాబట్టి ఆత్మ నెరుగని వాడెట్టి మహత్తర పుణ్య మాచరించినప్పటికిని అది ఫలానుభోగాంతమున నశించిపోవును. కావున ఆత్మను తన ప్రపంచమని ఉపాసించవలయును. అట్టివానికి కర్మము అంటదు. ఇట్టి అత్మజ్ఞాని ఏదేది ఇచ్చగించునో, అదన్తయు ఆత్మచే ప్రాప్తమగును.
కామము, సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము, అధైర్యము, లజ్జ, బుద్ధి, భయము – ఇవి అన్నియు మనస్సే (మనో రుపములే) అయియున్నవి.
(యాజ్ఞవల్క్యుడు – ఓ మైత్రేయి) భార్య తన భర్త యొక్క ప్రయోజనము నిమిత్తము ప్రియమైయుండుట లేదు. తన ఆత్మ యొక్క ప్రయోజనము నిమిత్తము ప్రియముగా నున్నది. అట్లే భర్త తన భార్యయందును, తండ్రి కుమారునియందును ఆ విధముగా సమస్తమును ఆత్మకోరకే కాని వేరుకాదు. ఆత్మయే చూడదగినది; ఆత్మయే వినదగినది; ఆత్మయే తలంచదగినది; ఆత్మయే ద్యానింపదగినది. ఆత్మయొక్క దర్శనము చేతను, స్మరణము చేతను, ధ్యానము చేతను సమస్తము బోధపడును.
ఆ ఆత్మయే (విశ్వాత్మయే, బ్రహ్మమే) ఈ ఆత్మ (జీవాత్మ). అది సమస్త ప్రానులకును అధిపతి. బండిచక్రముయొక్క నాభియందు అరములు (ఆకులు) గ్రుచ్చబడియున్నట్లు ఈ ఆత్మయందు సమస్తప్రానములు, సమస్త లోకములు, సమస్త దేవతలు, సమస్త భూతములు గ్రుచ్చబడియున్నవి.
ఆత్మ జలమువలె స్వచ్చమై, ఏకమై, ద్రష్టమై, అద్వైతమై యున్నది. అదియే బ్రహ్మలోకము, అనగా పరబ్రహ్మస్థానము. అదీ జీవునకు ఉత్తమగతి. అదియే సమస్త సంపదలకంటెను శ్రేష్టమైనది. అదియే పరమానందము. ఈ ఆనందముయొక్క ఒక్క అంశమున ఆధారపరచుకొని సమస్త ప్రానులును జీవించియున్నవి.
మనుజులలో ఎవడు సకల భోగములు అనుభావించుచు ఏదియు కొరతలేక యున్నదో, అందరికిని యజమానుడై యున్నాడో అట్టివాని ఆనందము ఒక్క మనుష్యానందమని చెప్పబడినది. దానికి నూరు రెట్లు కలది ఒక పితరుల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక కర్మ దేవతల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక ఆజానదేవతల ఆనందము.వేదాధ్యమును చేసినవాడును, పాపరహితుడును, కోరికలు లేనివాడును అజ్జనుదేవతల ఆనందముతో సమానమైన ఆనందము కలవాడై యుండును. ఆ ఆనందమునకు నూరు రెట్లదికమైన ఒక ప్రజాపతి ఆనందము. దానికి నూరు రెట్లు అధికమైనది బ్రహ్మానందము. శ్రోత్రియుడును, అకాముడును, పాపరహితుడను అగు మనుజుడు అట్టి బ్రహ్మానందమును అనుభవించుచున్నాడు. అదియే పరమానందము. ఈ పరమానందమే బ్రహ్మలోకము (పరబ్రహ్మ స్థానము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను.
జీవులలో సాధుకర్యము చేయువాడు సాదువైయుండును, పాపము చేయువాడు పాపియై యుండును, పుణ్యము చేయువాడు పుణ్యశాలియై యుండును. కావున జీవుడు పుణ్యపాపములకు తగిన శరీరమును గ్రహించుటకు కారనమైనవాడుగా నున్నాడు. ఎపుడతనికి ఒక సంకల్పము కలుగునో అపుడు ఒక నిశ్చయబుద్ది కలుగుచున్నది. ఎపుడు నిశ్చయబుద్ది కలుగునో, అపుడు కర్మము చేయనారంబించెను. తదుపరి ఆ కర్మఫలము అనుభావించవలసియున్నది.
జ్ఞాని అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మ కాముడు (ఆత్మకంటె వేరుగా మరొకదానిని కోరనివాడు). అట్టి వాణి ప్రాణములు ఎచటికిని పోవుటలేదు. అతడు ఇచటనే బ్రహ్మ స్వరూపుడగుచున్నాడు.
ఎపుడు జీవుని హృదయమందు కోరిక లన్నియు నశించి పోవునో, అపుడు మనుజుడు అమ్రుతుడగుచున్నాడు. ఇచటనే బ్రహ్మమును పొందుచున్నాడు.
అవిద్యను (అజ్ఞానమును) ఉపాసించువారు మనస్సును (అంధకారబందుర్గమగు సంసారమును) పొందుదురు. అజ్ఞానులు తమస్సుతోగూడిన లోకమున పొందుదురు.
అత్మసాక్షాత్కారమును బడసినవాడు విశ్వకృత్తు. అనగా సమస్తము అతని లోకమే (సమస్త లోకములు ఆత్మయందు కల్పింపబడి యుండుటవలన.
ఈ ప్రపంచమున మనము సాధనచే బ్రహ్మత్వమొందినవారము. లేనియెడల మహాకష్టము కలుగును. బ్రహ్మవిద్యచే మోక్షము కలుగును. అదిలేనిచో దుఃఖము కలుగును.
కలిగినట్టియు, కలుగబోవునట్టియు సమస్తమునకు అధిపతియైన పరమాత్మను ఎపుడు జీవుడు సాక్షాత్కరించుకోనుచున్నాడో అపు డాతడు ఇక దేనికిని భయపడవలసిన పనిలేదు.
నిర్మలమైన మనస్సుచేతనే ఆ బ్రహ్మము చూడదగును(సక్షాత్కారింపదగును).ఇచట అనేకత్వము ఒకింతైనను లేదు. సమస్తము బ్రహ్మమే.ఎవడించట అనేకత్వము చూచునో, అతడు ఒక ఒక మృత్యువు నుండి మరియొక మృత్యువును పొందును.(జనన మరణ రూప సంసారమున దగుల్కొనును).
ఈ బ్రహ్మమును ఈకముగా చూడవలెను. అది అప్రమేతమైనది; ద్రువమైనది; నిత్యమైనది; మాలిన్యరహితమైనది. ఆకాశము కంటే సూక్ష్మమైనది.జన్మము లేనిది. సర్వ శ్రేష్టమైనది.నాశరహితమైనది.      
ఇట్టి ఆత్మను (బ్రహ్మమును) దీరుడగు బ్రహ్మజ్ఞాని ఎరిగి ప్రజ్ఞను బడయవలెను. అనేక శబ్దములను ధ్యానింపరాదు. ఎలాయనిన అధిక శబ్దములు వాక్కునకు శ్రమయే యగును.
ఇట్టి ఆత్మనుగూర్చి వేదఋక్కుచే స్పస్టముగా చెప్పబడి యున్నది. ఆ ఆత్మ నిత్యమైనది. బ్రహ్మవేత్తయెక్క మహిమ అయి వున్నది. అది పుణ్య కర్మచే వ్రుద్దినిగాని, పాపకర్మచే క్షీణత్వమును గాని పొందుటలేదు. దాని మహిమ నేరింగినవాడు ఇక శాంతుడు. ఇంద్రియ నిగ్రహము కలవాడు, ఉపరతువు, తితిక్షువు, ఏకాగ్రచిత్తుడు. ఇతి సల్లక్షణములతో గూడి ఆ మహనీయుడు తనయందే ఆత్మను దర్శించుచున్నాడు.సమస్తమును ఆత్మగా చూచుచున్నాడు. అతనిని పాపపుణ్యములు అంటవు.అతడు పాపపుణ్యములను దాటుచున్నాడు.అతనిని కృతాకృత కర్మలు బాధించవు.అట్టి కర్మల నతడు భస్మముచేయుచున్నాడు. అతడు పాపరహితుడై, విరజ్జుడై, ఇచ్చారహితుడై, సంశయవర్జితుడై, బ్రహ్మము నేరింగినవాడై యుండు ఇదియే బ్రహ్మలోకము (అంటే ఇప్పుడు వున్నది మనము అంతయు పరమాత్మా లోకము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను.
ఈ ఆత్మ మహత్తరమైనది, జన్మరహితమైనది, వార్ధక్యములేనిది, మరణము లేనిది, అమృతమైనది, అభయమైనది. ఇట్లేరుగువారు ఆ అభయ బ్రహ్మమే (ఆత్మయే) అగుచున్నాడు.

ధనము చేత (సంపదల చేత) అమృతత్వము (మోక్షము) లభింపదు. లభించునను ఆశ వ్యర్ధన. అది ఒక్క సాధన ( ధ్యానము) ద్వార మాత్రమే లభింపబడుతుంది.

9.ఛాందోగ్యోపనిషత్తు:

ఓం నమో పరమాత్మయే నమః 

ఓం అను అక్షరమును ఊహించవలయును. ఓం అని గానము చేయవలెను.ఏ విధంగా అమరమై, అమృతమై, అభయమై యుండు ఓంకారమును ఊహించుచున్నాడో, అతడు దేవతలవలె అమృతత్వమును పొందును.
నామారూపాత్మకమగు ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే అయి యున్నది. ఈ జగత్తు దానినుండియే కలిగినది. దానియందే లయమగుచున్నది. దానియందే ప్రతిస్టితమైయున్నది. కావున శాంతుడై బ్రహ్మమును ఉపాసించ వలయును.
నామరుపాలతో గుడిన ఈ జగత్తు ఉత్పన్న మగుటకు పూర్వము సత్తుగా ఏకమై, అద్వితీయమై యుండినది.     
ఓ శ్వేతకేతు! ఈ సమస్త ప్రపంచము పరమాత్మచే పరిపూర్ణమై యున్నది. ఆ పరమాత్మయే సత్యము. అదియే ఆత్మ. అదియే నీవై యున్నావు.
ఆచార్యుడైన మనుజుడు బ్రహ్మమును తెలిసికొని వెంటనే మోక్షమును బడయుచున్నాడు.
సనత్కుమారుడు-భూమ (గొప్పది, బ్రహ్మము,ఆత్మ) అనునదియే సుఖము – అల్పమైన దానియందు సుఖము ఉండదు. కావున గోప్పదియే సుఖము. ఆ గోప్పదియగు ఆ ఆత్మనే తెలిసికొనవలయును.
దేనియందు(ఆత్మయందు) దానికంటె వేరైనది ఏదియు కనబడుటలేదో, వినబడుట లేదో, తెలియబడుట లేదో, అదియే భూమ. దీనికంటే వేరైనది అంతయు అల్పము. భుమా స్వరూపమగు ఆత్మ (బ్రహ్మము) నాశరహితమైనది. అల్పమైన దానికి నాశము కలదు.
ఆ భూమ (ఆత్మ) క్రింద, పైన, వెనుక, ముందు, ప్రక్కల అంతటయు నిండియున్నది. ఈ కనిపించు ప్రపంచమంతయు అదియే. అదియే నేను. నేనే క్రింద, పైన ఎల్లెడల ఉన్నాను. అంతయు నేనుగా వున్నాను.
క్రింద, పైన, అన్ని చోట్లను ఆత్మయే నిండియున్నది. అంతయు ఆత్మయే. ఈ విధముగా చుచియు, తలన్చియు, తెలిసికోనువాడు అత్మయందే క్రీడించుచుండును. అత్మ తనయందే వున్నదని ఆనందమొందుచుండును. తానె రాజైయుండును. సమస్త లోకములందును తన ఇష్ట ప్రకారము వర్తించుచుండును. ఎవడు ఆత్మను మరియొక విధముగా ఎరుగునో అట్టి అజ్ఞాని ఇతర రాజుకు లోబడియుండును. నాశముకల లోకములను పొందును. లోకము లన్నిటియందును తన ఇస్టప్రకారము సంచరించుటకు అతనికి సాధ్యపడదు.
ఈ ప్రకారము ఆత్మను తెలిసికోనినవాడు మృత్యువును చూడదు; రోగమును పొందడు; దుఃఖము నొందడు. సమస్తమును ఆత్మగా చూచును. సమస్తమును సర్వవిధములుగా అగుచున్నాడు. సృష్టికి పూర్వము ఆ ఆత్మయే (బ్రహ్మయే) యున్నది. తరువాత అదియే మూడై, ఐదై, ఏడై, తొమ్మిదై, అనేకమైనది.
మొట్టమొదట ఆహారమును శుద్దముగా చూడవలెను. దానిచే అంతఃకరణ శుద్ధి కలుగును. దానిచే స్మరణ శక్తి కలుగును. దానిచే అజ్ఞాన గ్రంధు లన్నియు విచ్చినములై పోవును. అతని దోషములు తోలిగిపోవును. అని భగవంతుడు సానత్కుమారుడు నారదునికి తెలిపెను.
ఈ దేహమునకు ముసలితనము కలిగినను బ్రహ్మమునకు (ఆత్మకు) అట్టి ముసలితనము కలుగదు. దేహమునకు దెబ్బ తగిలినను బ్రహ్మమునకు తగలదు. ఈ బ్రహ్మపురము సత్యమైనది. దేహము సత్యము కాదు. బ్రహ్మమునందు ఉత్తమ గుణములు ఆశ్రయించియున్నవి. ఈ ఆత్మ (బ్రహ్మము) పాపరహితమైనది. దీనికి ముసలితనము, మరణము, శోకము, ఆకలి, దప్పిక లేవు.అది సత్యకామమై (అది తలంచిన ప్రకారం జరుగును). సత్యసంకల్పమై యున్నది. ఇట్టి ఆత్మను తెలిసికొనవలయును. దానిని తెలిసికోనినచో ఈ లోకమున రాజుయొక్క ఆజ్ఞానవర్తులై అనుసరించువారు ఏ యే ఫలమును, ఏ యే ప్రదేశములలో కోరుదురో, దానినే పొండుడురుకాని సమస్తమును పొందనట్లు, సమస్తమును స్వేచ్చగా పొందలేరు.
ఈ ఆత్మ హృదయమునందే కలదు. ఈ ప్రకారము తెలిసికోనినవాడు ప్రతిదినము స్వర్గమును (బ్రహ్మమును) పొందును.
ఈ ప్రకారమెరిగినవాడు సంప్రసాదుడనబడును. అట్టి వాడు (బ్రహ్మానుగ్రహము నొందినవాడు) దేహాత్మ భావాది అజ్ఞానమునుండి తొలగి పరజ్యోతి స్వరూపమును(ఆత్మను) ఆశ్రయించి దానితో ఐక్యమొందుచున్నాడు. కనుక జీవునకు అత్మయనెడి పేరు ఏర్పడినది(జీవాత్మ అని). ఆ ఆత్మ అమృతమై, అభయమై, బ్రహ్మమై యున్నది. ఆ బ్రహ్మమునకు సత్యమని పేరు.
ఈ ఆత్మ సేతువు (గత్తు౦ వంటిది. సర్వమును భరించుచున్నది. ఈ ఆత్మ కాలపరిచ్చేదము లేనిది. దానికి ముసలితనము, మృత్యువు, శోకము, సుకృతి, దుష్క్రుతములు లేవు. కావున ఆత్మయందు సమస్త పాపములు నసించిపోవుచున్నవి. అత్మలోకము పాపసంబంధము లేనిది. కావున సదా ఆత్మను ఈ ప్రకారముగా ఉపాసించువారు స్వర్గమును (ఆత్మపదమును) పొందుచున్నాడు.
ఈ ఆత్మను తెలిసికోనినచో అంధుడు (అజ్ఞానము కలవాడు) అంధత్వము లేనివాడగును. శరీరమున్నపుడే అజ్ఞాని జ్ఞానియగును. శరీర మున్నపుడు, తచ్చరీరకార్యములచే దుఃఖమొందినవాడు సుఖమొందును. సంకటము నొందినవాడు సంకటము లేనివాడగును. ఆత్మను పొందిన వానికి రాత్రి పగలగుచున్నది. అతడు ఎల్లప్పుడు  (జ్ఞాన) ప్రకాశముకలవాడై ఆత్మైక్యము నొందును.
యజ్ఞమనునది బ్రహ్మచర్యమే. జ్ఞానియగువాడు బ్రహ్మచర్యము వలన యజ్ఞఫలమును పొందుచున్నాడు. బ్రహ్మచర్యముచే మనుజుడు ఆత్మను పొందుచున్నాడు.
హృదయమునందు నూటఒక్క నాడులు కలవు. వానిలో ఒక్కనాడి (సుషుమ్న) మూర్ధమునకు పోవుచున్నది. దానిద్వారా జ్ఞాని ఊర్ధ్వమునకేగి అమ్రుతత్వమును పొందుచున్నాడు. ఇతర నాడులు అడ్డముగా అంతటా వెల్లుచున్నవి.

ఆత్మ పాపరహితమైనది. వార్ధక్యము లేనిది, మరణము లేనిది, శోకము లేనిది, ఆకలిదప్పికలు లేనిది. అది సత్యకామమును, సత్యసంకల్పమును అయియున్నది. ఇట్టి ఆత్మను బాగుగ వెదకి తెలిసికోనవలెను. అట్లు తెలిసికోనినవాడు సమస్తలోకములను, సమస్త అభిలాషలను పొండుచున్నాడని ప్రజాపతి చెప్పెను.               

8.ఐతరేయోపనిషత్తు:

ఓం నమో పరమాత్మయే నమః 

సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడు మాత్రమె ఉన్నాడు. వేరొకటి అంటూ ఏదియును లేదు. లోకాలను సృష్టించాలి అని అనుకున్నాడు. సృష్టించాడు.
లోకాలను సృష్టి చేశాను. ఇక లోకరక్షకులను సృష్టిస్తాను అని అనుకున్నాడు. నీటి నుండి పైకి తీసి బ్రహ్మదేవున్ని సృష్టించాడు.
లోకపాలకులను సృష్టించిన తరువాత, నడినెత్తి చీల్చుకొని భగవంతుడు ఆ ద్వారం గుండా లోపలి ప్రవేశించాడు. ఆ ద్వారం పేరు విద్రుతి. ఆనందం కొలువైన స్థానం.  
భగవంతుడు ఇదంద్రుడు అని చెప్పబడుచున్నాడు. అవును నిశ్చయంగా అయన ఇదంద్రుడే. ఎందుకంటే ఇదో అని కనిపించేవాడిగా కూడ ఉన్నాడు. అందుకే ఆయనను పరోక్షంగా పేర్కొంటున్నారు.
మహాచైతన్యం పదార్థమైన ఆత్మే సృష్టికర్తగాను, దేవతలగాను(పంచ భూతాల అధిపతులగాను), ప్రకృతిగను (భూమి, ఆకాశం, గాలి, అగ్ని మరియు జలము) అనే ఐదు మౌలిక మూలకాలుగాను అదే ఉన్నది. సమస్త ప్రాణి కోటి మరియు సమస్త జీవరాసులు కూడా ఆ ఆత్మనే అయి వుంది. స్థావర జంగామాలు అన్నీ ఆత్మే. సమస్తం ఆత్మ మార్గదర్శకంలో నడుచుకుంటున్నాయి. అన్ని ఆత్మలోనే నేలకోనివున్నాయి. లోకమంతా ఆత్మచే నడిపించ బడుతోంది. సమస్తానికి ఆత్మే ఆధారం.మహాచైతన్య పదార్థమైన ఆత్మే బ్రహ్మ.

మహాచైతన్య పదార్థమైన ఆత్మను అవగతం చేసుకున్నవాడు, శరీర పతనానంతరం స్వర్గానికి వెళతాడు. సమస్త కోరికలు తీరినవాడై అమరత్వస్తితిని పొందుతాడు.

7.తైత్తిరీయోపనిషత్ :

ఓం నమో పరమాత్మయే నమః 

నేను సంసారవ్రుక్షము యొక్క అంతర్యామ్యాత్మ రూపమున ప్రేరకుడను. నా కీర్తి పర్వత శిఖరమువలె ప్రసిద్దమైయున్నది. నేను పరిశుద్దమైన జ్ఞానము (బ్రహ్మము) ముఖ్య కారణముగ కలవాడును. సూర్యునియందలి పవిత్ర ఆత్మతత్వమువలె నేను పరిశుద్దమైన అత్మతత్వమై యున్నాను. దీప్తిగల ధనమై (జ్ఞానమై) యున్నాను. పరిశుద్ద బుద్దిగాలవాడనై యున్నాను. మరణము లేనివాడను, అక్షతుడను అయి యున్నాను. అమృతముచే తడపబడినవాడనై యున్నాను-అని త్రిశంకు మహర్షి యొక్క వేదానువచనము.
వేదాధ్యయనాంతరము గురుదేవుడు శిష్యుని కిట్లు బోధించుచున్నాడు – సత్యము నుండి మరలకుము, ధర్మమునుండి మరలకుము. ఆత్మ సంరక్షణనుండి మరలకుము. స్వధ్యాయప్రవచనముల నుండి మరలకుము.తల్లి, తండ్రి, గురువు, అతిథి అను వీరిని దైవసమానులుగా తలంచి పూజించుము.
బ్రహ్మము నేరింగిన వాడు బ్రహ్మమునే పొందుచున్నాడు (బ్రహ్మయే యగుచున్నాడు). ఆ బ్రహ్మము సత్యమైనది, జ్ఞానస్వరుపమైనది, అనంతమైనది – అని ఋక్కు చెప్పుచున్నది. అదియే పరమవస్తువు.ఆ బ్రహ్మమును హృదయమందేవడెరుగునో, అతడు బ్రహ్మస్వరుపుడై, సమస్త భోగ్యములు ననుభవించును.
అట్టి ఆత్మ (బ్రహ్మము) నుండి ఆకాశం కలిగెను, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వి, పృథ్వి నుండి అన్నము, అన్నమునుండి పురుషుడు (దేహము) కలిగెను.
బ్రహ్మము లేదనువాడు లేనివాడే యగును. బ్రహ్మము కలదనువాడు వున్నవాడే యగును.
ఎపుడు సాధకుడు శరీరపు కండ్లకు కనబడదనియు, శరీరము లేనిదియు, ఇట్టిదని గుర్తించి చెప్పుటకు వీలుకానిదియు, గుర్తించుటకు అవకాశము లేనిదియు నాగు ఆత్మయందు ధైర్యముతో తన్ను పొందించుకోనునో అప్పుడతడు అభయమును పొందును. ఎప్పుడతనికి తానూ వేరనియు, ఆత్మ వేరనియు భేదబుద్ది కలుగుచున్నదో అతనికి భయము కలుగును. అతడు తెలిసినవడైయున్నప్పటికిని, భేదబుద్ది కలిగియుందడినచో అతనికి భయము కలుగును.

బ్రహ్మాది స్తంబపర్యంతముగల ఈ సమస్త ప్రాణులు దేనినుండి అవిర్భవించినవో, దేనిచే జీవించుచున్నవో, దేనియందు లాయించుచున్నవో అదియే బ్రహ్మము. అట్టి బ్రహ్మమును ఎరుంగవలయును (అని ఈ ప్రకారముగా తండ్రియగు వరుణుడు భ్రుగువనకు ఉపదేశించెను.

6.మండుక్యోపనిషత్ :

ఓం నమో పరమాత్మయే నమః 

ఈ సమస్త ప్రపంచం ఓమ్ అను అక్షరము (ప్రణవము) ఓంకారం నాశరహిత పరబ్రహ్మము.భూతభవిష్యద్వర్తమానములన్నియును ఓంకారమే. త్రికాలములను దాటియుండునది ఓంకారమే.
ఓంకారమని చెప్పబడిన ఈ సమస్త ప్రపంచము బ్రహ్మమే. అంతయు బ్రహ్మమే. ఈ జీవుడును బ్రహ్మమే. అట్టి ఓంకారము (బ్రహ్మము,ఆత్మ) నాలుగు పాదాలు కలిగివున్నది.
ఈ ఆత్మయే సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశములయందు అన్నిటికిని అదియే కారణభూతమై యున్నది.
ఈ ఆత్మ అంతఃప్రజ్ఞ (తైజసుడు) కాదు. బహీప్రజ్ఞ (విశ్వుడు) కాదు. ఈ రెండింటికిని మధ్య నుండునదియు కాదు. ప్రజ్ఞానఘనము కాదు; ప్రజ్ఞ కాదు; అప్రజ్ఞయు కాదు; అది అదృశ్యము, వ్యవహరించుటకు వీలులేనిది; ఇంద్రియములకు అందనిది. తలన్చుటకు సాధ్యము కానిది. ఇట్టిదని నిర్ణయించి చెప్పుటకు సాధ్యము కానిది. ఏకాత్మ యనెడు విశ్వాసము సారముగ గలది.లోకవ్యాపరము లేనిది. శాంతమైనది. మంగళకరమైనది. ఏకమైనది. ఈ ఆత్మయే తెలిసికొనుటకు తగినది.ఇది నాలుగవ పాదము.

ఓంకారమును ఆకారాది మాత్రలును విశ్వాది పాదములను లేని సమస్త ద్వైతోపశమనము కల మంగళస్వరూపముగా తెలిసికొనినవాడే తత్వవేత్త,జ్ఞానీ మరియు యోగి అయియున్నాడు. మరియొకడు కాడు. ఆ విధంగా ఆత్మ తత్వమును తెలుసుకొనిన వాడు ఆత్మ చేత ఆత్మను పొందుతున్నాడు.       

5.ముండకోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

శునక ఋషి కుమారుడు ఉత్తమ గృహస్తుడని పేరు పొందిన వాడు ఐన శౌనకుడు శాస్త్రోక్తరీతిగా అంగీరస మహర్షిని సమీపించి వినమ్రుడై హే భగవాన్, దేనిని తెలుసుకోవడం చేత ఈ ప్రపంచం అంతా తెలుసుకోబడుతుంది? అని అడిగాడు.
అంగీరసుడు శౌనకునికి ఇలా బదులు చెప్పాడు. పరావిద్య అపరావిద్య అని తెలుసుకోవలసిన విద్యలు రెండు వున్నాయని బ్రహ్మవిదులు చెబుతారు.
ఈ రెండు విద్యల్లో నాలుగు వేదాలు, వేదంగాలైన శిక్షా, కల్పం, వ్యాకరణ, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యము అన్నీ అపరా విద్యలే. ఇక శాశ్వతము అమరము ఐన తత్వాన్ని అందించే విద్యే పరవిద్య.
కళ్ళు మొదలైన వాటికీ గోచరంకానిది, చేతులు మొదలైన వాటికీ దొరకనిది, ఉత్పత్తిలేనిది, రంగు లేనిది, కళ్ళు చెవులు చేతులు కాళ్ళు లేనిది, శాశ్వతము అయినది , అంతటా వ్యపించినదీ, అత్యంతము సుక్ష్మమైనదీ సృష్టికి మూలకారణమైనదీ ఐన ఆ అక్షరాతత్వాన్ని జ్ఞానులు సకల జగత్తుకు మూలంగా అంతటా చూడగలరు.
సాలెపురుగు ఎలా తన గూడును నోటి నుండే వెలికితీసి తన లోకే తీసుకుంటుందో, భూమినుండి మూలికలన్ని ఎలా ఉద్భావిస్తాయో, మానవుని తలమీద, శరీరం మీద ఏ ప్రయత్నం లేకనే ఎలా పెరుగుతాయో అలాగే ఆ అక్షరాతత్వం నుండి ఈ విశ్వం ఉత్పన్నమవుతుంది.
సృష్టికర్త సర్వవిడుడు, జ్ఞానమే తపంగాగల బ్రహ్మ సకల ప్రాణులు వాటి ఆహారం అన్నీ పరబ్రహ్మం నుండి ఉద్భవిస్తున్నవి.
ప్రపంచిత అజ్ఞానంలో ఊరుతూ తామే ప్రజ్ఞాశీలురం, విదితవేదితవ్యులము అని ఆత్మస్తుతి చేసుకునే మూర్ఖులు రోగం, ముసలితనం, మృత్యువు వంటి దుఃఖ పరంపరలచేత మళ్ళీ మళ్ళీ పీడింపబడుతూ గుడ్డివాని నేతృత్వంలో నడిచే మరికొందరు గుడ్డివాల్లలా జన్మ జన్మలకు దారి తెలియక తిరుగాడుతూ వుంటారు.
అజ్ఞానంలో మునిగివున్న ఈ మూర్ఖులు తామే కృత క్రుత్యులమని భావిస్తుంటారు. ఎందుచేతనంటే కర్మఫలాలపట్ల ఆసక్తి ఉన్నంతవరకు వారికీ జ్ఞానోదయం కాదు. అందుచేత పుణ్యకర్మల ఫలితామైన స్వర్గాది లోకాలు అనుభవించాక వారికీ మళ్ళీ అధోగతే !
ఈ మందబుద్దులు యజ్ఞకర్మలు, పుణ్యకార్యాలు మాత్రమే సర్వోత్తమమైన వనుకుంటూ అంతకు మించినది లేదనుకుంటారు. వీళ్ళు భోగాలకు పుట్టినిల్లయిన స్వర్గ లోకాలలో తమ పుణ్యఫలాన్ని అనుభవించి మళ్ళీ ఈ లోకాన్ని వదిలి హీనమైన లోకాల్లో ప్రవేశిస్తారు.
శాంతచిత్తులు, విద్వాంసులు బిక్షాటనవ్రతులై అడవిలో ఏకాంతంగా శ్రద్దాపూర్వకమైన తపోనిష్టతో జీవితాన్ని గడిపే సత్పురుషులు పాపధూలలిని కదిగివేసుకొని సుర్యమార్గం ద్వార శాశ్వతం అక్షయం ఐన తత్వం వుండే చోటికి చేరుతారు.
వివిధ కర్మలద్వార ప్రాప్తించే లోకాలను పరీక్షించి ముముక్షువు వానిపట్ల వైరాగ్యాన్ని వహించాలి. కర్మలవల్ల పరతత్వాన్ని పొందలేము ! అందుచేత ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి అతడు విద్యుక్తంగా వేదవిదుడు, బ్రహ్మనిష్టుడు ఐన గురువువద్ద శిష్యరికం చేయాలి.
సత్యం ఇదే: జ్వాలలు లేస్తున్న మంటలనుండి అటువంటివే నిప్పురవ్వలు వేలకొలది ఎలా పుట్టుకోస్తాయో సరిగా ఆ విధంగానే అక్షరమైన బ్రహ్మంనుండి నానా విధాలైన జీవులు ఉద్భవిస్తాయి. మళ్ళీ అందులోనే విలీనమవుతాయి.
స్వతః ప్రకాశం, నిరాకారం, అనాది శుద్ధం, సర్వవ్యాపకం ఐన ఆ తత్వం లోపల వెలుపల కూడా వుంది. జీవానికి మనస్సుకు ప్రాచీనమైన ఆ తత్వం అవ్యక్తమై జగత్తు కారణ రూపానికి కూడా అతీతమైనది.
ఆ తత్వం (పరమాత్మా) నుండే జీవం, మనస్సు, అన్ని ఇంద్రియాలు,గాలి, ఆకాశం, నిప్పు, నీళ్ళు, సకలాధారమైన భూమి అన్నీ పుట్టాయి.ఈ విధంగా సర్వవ్యాపి ఐన ఆ తత్త్వం నుండే అన్ని జీవులు పుట్టుకొచ్చాయి.ఈ తత్వమే సర్వభూతాలలోను ఉన్న అత్మకుడా.
ఆ తత్వం నుండి వివిధ లోకాలు, ఆ లోకలోలోని దేవతలు, సాద్యులు, మానవులు, జంతువులూ, పక్షులు ఉచ్ఛ్వాసనిశ్వాసాలు, వారి యువాధాన్యాలు, తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్యం విదినిశేదాలు అన్నీకూడ పుట్టుకొచ్చాయి.
ఆ పరతత్వం నుండి ఏడూ ఇంద్రియాలు, వాటి గ్రహనశక్తులు, వాటి విషయాలు, వాటి జ్ఞానం, హృద్గుహలలో వుంటూ జీవశక్తులు సంహరించే ఏడేడు లోకాలు, అన్నీ ప్రభవిస్తాయి. ఇవన్నీ ఎడేడుగా భగవంతుడే సృష్టించాడు.
అన్ని సముద్రాలూ, పర్వతాలు కూడా భగవంతుడు నుండే ఉద్భవిస్తాయి. అన్ని నదులు ఆయననుండే ప్రవహిస్తాయి. ఏ మూలికల రసాలుచేత పోషింపబడి పంచాభూతాలచేత అవరింపబడిన సూక్ష్మశరీరం వుంటున్నదో ఆ ములికలన్నీ ఆ పరతత్వం నుండే సంభవిస్తున్నాయి.
స్వగతమైన ఆ తత్వం యజ్ఞకర్మలు జ్ఞానం తపస్సు అన్నియు ఈ సమస్తంలోను వున్నది. ఓ సౌమ్యుడా! హృద్గులలో ఒదిగిఉన్న సర్వ శ్రేష్టము అమరము ఐన బ్రహ్మము ఆ తత్వమే అని తెలుసుకున్నవాడు అవిద్యాగ్రంధిని తెంచివేసి ఈ జన్మలోనే ముక్తుడవుతాడు.
అన్ని అనుభావాలలోను ప్రత్యక్షమయ్యేది అత్యంత సమీపంలో ఉన్నది. హృద్గుహలో ఉన్నది ఐన ఆ బ్రహ్మం అన్నింటికీ ఆశ్రయం. కదిలేవి, స్వాశించేవి, రెప్పలార్చేవి, ఆర్చనివికూడా సమస్తము ఆ బ్రహ్మములోనే ప్రతిష్టితమై ఉన్నవి. స్తూలసూక్ష్మలకు కారణం సర్వారాధ్యం, సర్విత్క్రుష్టం, విజ్ఞానానికి కూడ అతీతమైన ఆ బ్రహ్మాన్ని తెలుసుకో.
ప్రకాశవంతం అణువుకంటే సూక్ష్మం ఐన ఆ అక్షరాబ్రహ్మం సకల లోకాలకు ఆ లోక వాసులకు కూడా నిలయం. ఆ బ్రహ్మమే ప్రాణం వాక్కు మనస్సు స్వద్వస్తువు అమరత్వంకూడ.
ఉపనిషత్తులు అందించే మహాస్త్రాన్ని ధనస్సుగా తీసుకో. నియమానుసారం నిత్యం చేసే ఉపాసనలవలన తీక్ష్ణమైన బాణాన్ని ఎక్కుపెట్టు. ఎటూ చెదరకుండా బ్రహ్మచింతనలోనే కేంద్రీకృతమైన మనస్సుచేత వింటినారిని చేవిదాకా లాగు! నాశంలేని బ్రహ్మమే లక్ష్యం. ఆ బ్రహ్మాన్ని తెలుసుకో.
ఓం అనే ప్రణవమంత్రమే ధనుస్సు. లోనున్న ఆత్మయే బాణం. బ్రహ్మమే లక్ష్యం. ఏమరపతులేని మనస్సుతో ఆ లక్ష్యాన్ని చేదించాలి. బాణం లక్ష్యాన్ని చేదించి దానితో ఒకటైపోయినట్లే బ్రహ్మంతో ఐక్యమైపోవాలి.
భూమ్యాకాశాలు వాటి మధ్యనున్న అంతరాళము, మనస్సు పంచప్రాణాలు దేనియందు పడుగు పేకగా అల్లుకొని ఉన్నాయో అదే ఆత్మ అని తెలుసుకో. తదితరమైన వ్యర్ధప్రసంగల్లు వదిలిపెట్టు. ఈ సంసారసాగరాన్ని దాటి అమరత్వం ఇచ్చే సేతువే ఇదే.
ఈ భూమిపైన కనిపిన్చేదంతకుడా ఆ ఆత్మవైభవమే. హ్రుదయాకాశంలోని జ్యోతిర్మయమైన బ్రహ్మపురిలో దాని నివాసం.మనస్సే దానికి వస్త్రం. ప్రాణ శరీరాలకు అది అధినేత. హృదయంలో స్థిరపడి అది శరీరమంతట నివసిస్తుంది. పరిపూర్ణమైన విజ్ఞానంచేత ప్రాజ్ఞులు ఆనందమయమైన ఆ అమరత్వస్తితిని సాక్షాత్కరించుకుంటారు.
ఎగుడు దిగుడులలో కూడా ఆత్మను సాక్షాత్కరించుకోవడం వలన అతని అజ్ఞానపు ముడి విడిపోతుంది. అన్ని సంశయాలు సమసిపోతాయి. అన్ని కర్మలు క్షయించిపోతాయి.
జ్యోతిస్వరుపమైన ఆ ఆనందమయకోశంలో మానవుని నిగూఢ గహనాలలో నిర్మలంనిరవయవం విశుద్ద్డం ఐన బ్రహ్మం వాసం చేస్తుంది. కాంతి నిచ్చే అన్నింటికీ కాంతి అదే. దాన్నే ఆత్మవిదులు సాక్షాత్కరించుకుంటారు.
అక్కడ సూర్యుడు ప్రకాశించాడు. చంద్రుడు తారలు వెలుగు నీయవు. మెరుపులుకుడా కాంతి నీయవు. ఇక కేవలమైన అగ్ని మాట చెప్పడమెందుకు? ఆత్మ తేజస్సు వళ్ళ మాత్రమే సర్వము కాంతులీనుతుంది! ఈ యవద్విశ్వము ఆ ఆత్మజ్యోతి వల్లనే దేదీప్యమానమవుతూ ఉన్నది.
నిజంగా ఇదంతా శాశ్వతమైన బ్రహ్మే. కింద మీద ఈ పక్క ఆ పక్క ముందు వెనక సర్వత్రా ఆ బ్రహ్మం విరాజమానమై ఉన్నది. నిజంగా ఈ యవద్విశ్వం సర్వోత్క్రస్టమైన ఆ బ్రహ్మమే.
ప్రాణ స్నేహితులై ఎప్పుడూ కలిసి ఉండే రెండు పక్షులు ఒకే చెట్టుపైన కూర్చొని ఉన్నవి. వాటిలో ఒకటి చెట్టు పండ్లను ఆశక్తితో తింటుంది. మరొకటి ఏమి తినకుండా చూస్తూ ఉన్నది.ఒక చెట్టుమీద కూర్చొని ఉన్న ఆ రెండింటిలో ఒకటి జీవాత్మ. అజ్ఞానంలో భ్రమలో మునిగి తన దౌర్భల్యానికి దుఃఖిస్తున్నది. కానీ ఆరాధనీయమైన ప్రభువైన దానిని, పరమాత్మను, దాని వైభవాన్ని చూడగానే దాని దుఃఖమంతా తరిగిపోతున్నది.
స్వయంప్రకాసమైన, సృస్టికర్తయైన బ్రహ్మకుకూడ ఆదియైన, సకల జగత్తుకు కర్తయైన, ప్రభువైన పరమాత్మను సాక్షాత్కరించుకోగానే విద్వాంసుడైన సాధకుడు పుణ్యపాపాల నతిక్రమించి దుఖఃరహితము సర్వోత్క్రస్టము అయిన సమస్తితిని చేరుకుంటాడు.
ప్రాణమై ఆ ఈశ్వరుడే సకల జీవులలో ప్రకాశిస్తున్నాడు. ఇది సాక్షాత్కరించుకున్నవాడు వాక్కును నిగ్రహించి, నిజమైన విద్వాంసుడవుతాడు. అతడు నిత్యం అత్మయందే విహరిస్తూ అత్మయందే ఆనందిస్తూ పున్యకర్మలను చేస్తూ బ్రహ్మజ్ఞానులలో అగ్రస్థానం వహిస్తాడు.
ఆత్మనిగ్రహం గలవారు తమలోని పాపకల్మశం లేశమాత్రం కూడా లేకుండా క్షయించిపోగ జ్యోతిర్మయం పరిశుద్ధం ఐన ఆత్మను సాక్షాత్కరించుకుంటారు. సత్యం తపస్సు ధ్యానం జ్ఞానం బ్రహ్మచర్యం చక్కగా నిరంతరాయంగా అభ్యసించడంచేత ఆ ఆత్మ మనస్సులోనే లభ్యమవుతుంది కదా!
అపరిమితమైన జ్యోతిస్వరూపం ఊహాతీతమై బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మతి సూక్ష్మం, అది ఇక్కడే ఈ శరీరలోనే ఉన్నది. ఋషులు హృదయస్తమై ఉన్నదానిని ఈ జన్మలోనే సాక్షాత్కరించుకుంటారు.
ఆత్మను మాటలచేత వర్ణింపనలవికాదు, దాన్ని కళ్ళు చూడలేవు. ఇంద్రియాలు గ్రహించలేవు. కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్చమైనపుడు అతని ప్రాణ మన శరీరాలు సర్వం విశుద్ది పొందుతాయి. అపుడు ధ్యానమగ్నుడైనవాడు ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు.
ప్రాణం ఐదు విధాలుగా వ్యాపించి ఉన్న ఈ శరీరంలో సుక్ష్మమైన అత్మతత్వాన్ని విజ్ఞానం ద్వార తెలుసుకోవాలి. మానవుని జ్ఞానాన్ని ఇంద్రియాలు చిక్కగా అల్లుకొని వున్నాయి. ఆ జ్ఞానం స్వచ్చం నిర్మలం కాగానే ఆత్మ అందులో భాసిస్తుంది.
ఆత్మసాక్షాత్కారం పొందినవాడు ఉజ్వలమై ప్రకాసించేది, సకల జగత్తుకు ఆధారమైనది ఐన బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. అట్టి పురుషుని పట్ల నిష్కాములై శ్రద్దాలువులైనవారు పునర్జన్మ బాధను దాటిపోతారు.
ఇంద్రియభోగాలను పదే పదే తలుచుకుంటూ వాటికోసం ఆరాటపడేవాళ్ళు ఆ కోరికలు తీరడానికి అక్కడక్కడ జన్మలెత్తుతారు. కానీ ఆత్మ లభంపొంది అన్ని కోరికలను ఆత్మలో నేలయం చేసిన ధన్యుడికి ఈ జన్మలోనే అన్ని కోరికలు అదృశ్యమై పోతాయి.
గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని చాల శాస్త్రాల అధ్యయనం చేయడంవలనగాని ఎన్నో గుడార్థాలు మహాత్ములవడ్డ వినడం వలన గాని అత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మకోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మనన నిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది.
ఆత్మ మనోబలం లేనివారికి, అజగ్రత్తపరులకు, శాస్త్రవిరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం పొందగలదు.
అత్మలాభం పొందిన ఋషులు అత్మజ్ఞానంతో సంతుస్టులవుతారు. ఇక వారికీ కావలసిందేమిలేదు. వారు పరమాత్మస్వరూపులు సంగారహితులు శమించిన ఇంద్రియాలు కలవారు. సర్వవ్యాపియైన బ్రహ్మాన్ని ఎల్లెడలా సాక్షాత్కరించుకొని ప్రాజ్ఞులైన ఆ వినీతమతులు అన్నింటా ప్రవేశిస్తారు.
వైరాగ్యమయమైన జీవనం ద్వార నిరంతరభ్యాసం ద్వార పవిత్రస్వభావులై, వేదవేదంటలు అన్వేషించి పరమాత్మయందే సుస్థిరులైన సాధకులు సాక్షాత్కర సమయంలో అమరులై బ్రహ్మీభుతులవుతారు.అన్నివిధాల ముక్తులవుతారు.
వారి పదిహేను అంశాలు వాటి స్థావరాల్లోకి చేరిపోతాయి. ఇంద్రియాలు వాటి వాటి అదిదేవతలలో లీనమవుతాయి.వారి కర్మలు, జీవాత్మ పరమమైన అక్షయతత్వంలో ఐక్యమవుతాయి.
ప్రవహించే నదులు వాటి పేర్లను ఆకారాలను కోల్పోయి ఎలా సముద్రంలో ఏకామవుతాయో అలాగే జ్ఞానికూడా తన నామరూపాల నుండి ముక్తుడై సర్వోత్క్రుస్టం దీప్యమానం ఐన పరబ్రహ్మతత్వంలో లీనమవుతాడు.

ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్న ప్రతివాడు పరబ్రహ్మమే అవుతాడు.హృదయగ్రందులు కరిగిపోగా అతడు శోకపాపాలకు అతీతుడై శాశ్వతమైన అమరత్వాన్ని అందుకుంటాడు.

4.ప్రశ్నోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

మీరు మరల ఒక సంవత్సరము వరకును తపస్సుతోను, బ్రహ్మచర్యముతోను, శ్రద్దతోను నివసింపుడు, తదుపరి మీయిష్ట ప్రకారము ప్రశ్నలను అడుగుదురు. మే మేరుగుదు మేని సర్వమును మీకు వచింపగలము.
కొందరు మహనీయులు ఉత్తరామార్గామును అవలంబించి తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ, విద్య – వీనిచేత ఆత్మ నెరింగి ఆత్మరూప సూర్యలోకమును (అంటే మనకు కనిపించే  సూర్యగ్రహం కాదు) జయించుదురు. ఈ ఆత్మ రూప సూర్యుడే ప్రాణాధారము. ఇది అమృతము, భయరహితము, అన్నిటికంటేను శ్రేష్టమైనగతి. ఇచ్చటినుండి మరల తిరిగి వచ్చుట లేదు. పునర్జన్మ లేదు.
ఓంకార స్వరూపమును ఏ విజ్ఞుడు తెలిసికొనుచున్నాడో అట్టివాడు శాంతమై, అజరమై, అమృతమై అభయమైనట్టి పరబ్రహ్మమును పొందుచున్నారు.

రథచక్రమందలి ఆకులవలె సమస్తకళలు ఎవనియందు ప్రతిస్టితములై యున్నవో, అట్టి వేద్యుడగు పురుషుని (ఆత్మను) పొందుడు. మిమ్ము మృత్యువు బాధింపక యుండును.         

౩.కఠోపనిషత్తు :

ఓం నమో పరమాత్మయే నమః 

స్వర్గ ఫలాలను కోరి వాజశ్రవనుడు ఒకయుగంలో తన అస్తినంతటిని దానం చేశాడు. అతనికి నచికేతుడనే పేరు గల ఒక పుత్రుడున్నాడు.
నచికేతుడు, తండ్రీ నన్ను ఎవరికి ఇవ్వబోతున్నావు? అని అతడు తండ్రిని రెండు మూడు సార్లు అడిగాడు. ఆ ప్రశ్నకి కోపం వచ్చిన తండ్రి నిన్ను మృత్యు దేవతైన యముడికి యిస్తాను అని బదులు పల్కాడు.
అప్పుడు నచికేతుడు తనలోతాను ఇలా అనుకున్నాడు, నన్ను యముడికి ఇవ్వటంలో అయన ఉద్దేశ్యం ఏమిటి ? అప్పుడు నచికేతుడు ఇలా ఆలోచించాడు, ప్రాచీనులు ఎలా వర్తించారో జ్ఞాపకం తెచ్చుకో. అలాగే ఇపుడు ఇతరులు కూడా ఎలా నడుచుకుంటున్నారో గమనించు. మర్త్యులు ధాన్యంలాగానే పండి రాలిపోతారు. ధాన్యంలాగానే మళ్ళీ పుట్టుకొస్తారు.
సత్యమహిమను గుర్తించినవాడై నచికేతుని తండ్రి చివరికి తన కుమారుని యముని వద్దకు పంపుతాడు. అప్పుడు యముడు ఇంట్లో ఉండదు. అందుకు నచికేతుడు నిద్రాహారాలు లేకుండా మూడు రోజులు వేచి ఉండవలసి వస్తుంది. యముడు తిరిగి వచ్చాక నచికేతునితో యముడు ఇలా అన్నాడు, నీవు నిరాహారిగా మూడు రాత్రులు గడిపావు కావున వాటికీ పరిహారంగా మూడు వారలు కోరుకో.
అప్పుడు నచికేతుడు మూడు వరాలు కోరుకుంటాడు. అందులో రెండు వరాలను యముడు మామూలుగానే ప్రసాదిస్తాడు కానీ నచికేతుడు మూడో వరం ఇలా అడుగుతాడు.
మానవుడు మరణించాక వచ్చే సందేహమిది. చనిపాయిన వ్యక్తీ ఉన్నాడని కొందరంటారు. మరీ కొందరు లేదంటారు. దీని గురించి తెలుసుకోవాలని నా కోరిక. అప్పుడు యముడు, నచికేత ఇది చాల సూక్ష్మమైన విషయం. అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. అందువలన వేరే ఏదైనా కోరుకో, ఈ వరం మాత్రం నన్ను అర్ధించకు. ఈ మాటనుండి నన్ను వదిలిపెట్టు.
అప్పుడు నచికేతుడు ఈ విషయం అంత సులభంగా అర్ధమయ్యేది కాదని నువ్వే చెపుతున్నావు. నాకు నీతో సమానుడైన ఆచార్యుడు కూడ ఎక్కడ లభ్యం కాడు. అందుచేత ఈ వరంతో సమానమైన వరం మరేది లేదనే నేను అనుకుంటున్నాను.
అప్పుడు యముడు, ఓ నచికేత నీవు అనుభవించడానికి కావలసినన్ని సంపదలు మరియు ఎంతో అందమైన స్త్రీలు, మరియు నీవు నీకు ఇష్టమైనంత వరకు జీవించెంత కాలమును నీకు ప్రసాదిస్తాను వాటిని కోరుకో అంటాడు. దీనితో సమానమైన వరమేదైనా నీకు తోస్తే అదే కోరుకో . ఓ నచికేత సువిశాల సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తిగా వుండు. నీకు కలిగే కోరికలన్నీ నేరేవేరెలా నేను వరమిస్తాను. కానీ మరణాన్ని గురించి మాత్రం నన్ను అడుగవద్దు.
అప్పుడు నచికేతుడు, ఓ యమరాజ నువ్వు చెప్పే ఇవన్ని కూడా క్షణికాలే మానవుడి ఇంద్రియాల శక్తిని నశింపజేసేవే. ఎంత పొడిగించినా మానవుడి జీవితం అల్పమే. అందువలన నీవు ఇవ్వదలచుకున్నవి అన్నియు నువ్వే ఉంచుకో. 
మానవుడు ఏనాటికి ధనంతో తృప్తి పడలేడు. నువ్వు విధించినంత కాలము ఎలాగు జీవిస్తాము . కానీ మరణానంతరము వుండే అమోఘమైన జీవితం గురించిన జ్ఞానం నేను కోరే వరం .
అప్పుడు యముడు, ఓ నచికేత అజ్ఞానము జ్ఞానము అనబడే ఈ రెండు విభిన్న గమ్యాలకు తీసుకుపోయేవి. అపారమైన అంతరం కలవి. నచికేతుడు జ్ఞానాన్ని అన్వేషిస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్ని విషయభోగాల ప్రలోభాలైన నిన్ను చలింపచేయలేక పోయాయి.
లోకములో ఒకటి శ్రేయస్సు నొసంగునది, మరియొకటి దానికంటె విలక్షణమైనది ప్రేయస్సు నొసంగునది అని రెండు కలవు. భిన్నర్ధములు కల ఈ రెండును మనుజుని చెంతకు వచ్చి చేరుచున్నవి. ఇందు శ్రేయస్సును అనుసరించువానికి శుభము కలుగును. ప్రేయస్సును వాంచించువాడు గమ్యస్థానమును పొందజాలడు.
శ్రేయస్సు, ప్రేయస్సు అను రెండును మనుజుని సమీపించును. వివేకవంతు లీ రెంటిని చక్కగా పరీక్షించి ఒకదానినుండి మరియొక దానిని వేరు చేయుదురు. అందు శ్రేయస్సును మాత్రమె ధీరుడు కోరుకొనును. మండబుద్దిగాలవాడు రాగాత్రుష్ణలకు లోనై ప్రేయస్సునే కోరుకొని బంధమునందు చిక్కుకోనును.
గాఢమైన అజ్ఞానంలో కూరుకుపోయి వున్న మూర్ఖులు తామే ప్రజ్ఞావంతులు గొప్ప విద్వాంసులు అనుకుంటూ గ్రుడ్డివాళ్ళ చేత నడిపించబడే గ్రుడ్డివాళ్ళలాగా తూలుతూ తడబడుతూ సుడులు తిరుగుతూ వుంటారు.
జాగ్రత్తలేని బాలుడికి వలె ధనమదంతో మతిపోయిన వారికీ శ్రేయోమర్గము ఎన్నటికి కనిపించదు. వున్నది ఈ లోకమే మరో లోకం లేదు అనుకునేవాడు మళ్ళీ మళ్ళీ నా చేతిలో పడుతూ ఉంటాడు.
దానిగురించి వినడం కూడా ఎంతోమందికి సాధ్యపడదు. దాని గూర్చి వినినవరుగూడ ఎందరొ దానిని గ్రహించలేరు. దాని గురించి విని దాన్ని గ్రహించగలిగిన వాడే నిజంగా అద్భుతమైన వాడు. అతి సూక్ష్మ బుద్ధి కలవాడు.
శాశ్వత వస్తువు అశాశ్వత వస్తువులచేత ఎన్నటికిని పొందబడదు గనుక ఈ సంపదలన్నియు అనిత్యాలని నాకు తెలుసు. అయిన ఈ అనిత్య వస్తువులతో నేను నచికేతాగ్నిని నిర్వర్తించాను. (తద్వారా) శాశ్వత వస్తువును పొందాను.
ఓ నచికేత దీమంతుడవైన నువ్వు ద్రుడనిశ్చయంతో తిరస్కరించావు. అందువలన నేను నీకు చెప్పుచుంటిని దాని గురించి. అది (ఆత్మ)ఈ శరీరంలోనే వున్నది, హృదయంలో ఆసీనమై ఉన్నది, సనాతనము అతి సూక్ష్మము అంతర్లీనము జ్యోతిర్మయము అయిన ఆ ఆత్మను ధ్యానము ద్వార సాక్షాత్కరించుకొని ధీశాలి సుఖ దుఃఖాలకు అతీతుడవుతాడు.
ధర్మానికి ప్రాణమైన ఆ సుక్ష్మతత్వాన్ని విని తగిన విధంగా అలోచించి చక్కగా గ్రహించిన మానవుడు దానిని పొందుతాడు. ఆనందించదగిన దానిని పొందడంచేత ఆనందపరవశుడవుతాడు. నచికేతునికి ఇది తెరచిన ఇల్లే అని నేను భావిస్తున్నాను.
ధర్మాధర్మాలకు కార్యకారణాలకు భూత భవిష్యత్తులకు కూడా భిన్నంగా నువ్వు దేన్నీ సాక్షాత్కరించుకున్నవో దాన్ని దయచేసి నాకు ఉపదేశించు.
అన్ని వేదాలు ఘోషించే గమ్యము అన్ని తపస్సులు ఉద్ఘాటించే గమ్యము ఐన దేన్నికోరి సాధువులు బ్రహ్మచర్య గడుపుతారో దాన్ని సంగ్రహంగా చెపుతున్నాను విను.
అదే ఓంకారం. ఈ అక్షరమే బ్రహ్మము. ఈ అక్షరమే సర్వోత్తమము కూడా. ఈ అక్షరాన్ని తెలుసుకున్నవారికి ఏది కోరితే అది సిద్దిస్తుంది.           
జ్ఞాన ఐన ఆత్మ పుట్టదు. చావదు. దేని నుంచిగాని అది పరిణమించదు. శరీరం నశిస్తూ ఉన్నప్పుడు కూడా జన్మరాహిత్యము ఆ నశ్వరము శాశ్వతము సనాతనము ఐన ఈ ఆత్మకు నాశనమనేది లేదు, ఆత్మ చంపబడదు.
సుక్ష్మాతి సూక్ష్మమైన అణువుకంటే చిన్నదీ బ్రహ్మాండాని కంటె ఘనమైనది ఐన ఆత్మ ప్రాణుల హృదయాలలోనే ఉన్నది. కామరహితుడు శోకరహితుడై ఇంద్రియాలయొక్క మనస్సు యొక్క పవిత్రత ద్వార ఆత్మ మహిమను సాక్షాత్కరించుకుంటాడు.
కదలకుండా కూర్చునే వున్నా అతడు ఎంతోదూరం ప్రయాణిస్తాడు. పడుకునే ఉన్నా అతడు సకల ప్రదేశాలకు పోతాడు. ఆనందమయుడు ఆనందరహితుడు ఐన ఆ జ్యోతిర్మయుడిని తెలుసుకోన సమర్ధుడై ఉన్నాడు.
శరీరరహితము సర్వవ్యాపి ఐన పరమాత్మను అస్తిరములైన అన్ని శరీరలలోను వున్నది అని తెలిసికొని ప్రజ్ఞావంతుడు శోకింపడు.
వేదాధ్యయన చేతగాని బుద్ధి కుసలచేతగని అపారమైన పాండిత్యము చేతననైనగాని ఈ ఆత్మ పొందబడదు. అది ఎవరిని వర్తిస్తుందో ఎన్నుకుంటుందో అతనిచేతనే ఆత్మ పొందబడుతుంది. అంటే అతనియోక్క ఆత్మే తనయొక్క నిజస్వరూపాన్ని వెల్లడిస్తుంది. దీనిని ధ్యానము ద్వార నీ హృదయంలోనే దర్శించుకోవచ్చు లేకపోతె జ్ఞానము ద్వార కూడా ఈ సమస్తాన్ని పరమాత్మగా భావించి ఆత్మానుభూతి పొందవచ్చు.
దుష్ప్రవర్తనము నుండి విరమించనివారు, శాంతిలేనివారు, ఏకాగ్రచిత్తములేనివారు, అశాంతమానసులు ప్రజ్ఞచే నైనను ఆత్మను బడయజాలరు.
ఓ నచికేత, ఆత్మ దాన్ని అధిరోహించిన యజమాని అని తెలుసుకో . అలాగే శరీరము రథము బుద్ధే సారధి మనస్సు కళ్లము అని గ్రహించు.ఇంద్రియలె గుర్రాలు ఇంద్రియ విషయాలే అవి పరుగులుతీసే మార్గాలు అని అంటారు. శరీరము ఇంద్రియాలు మనస్సులతో కూడివున్న ఆత్మనే ప్రాజ్ఞులు భోక్తగా చెపుతారు.
మనస్సును విచ్చలవిడిగా వదిలేసి సరైన జ్ఞానం లేకుండా ఎవరైనా ఎల్లప్పుడూ సంచరిస్తే అలాంటివాని ఇంద్రియాలు దోషం వున్న గుర్రాలు అదుపుతప్పి పోయినట్లే వశం తప్పిపోతాయి.
అయితే ఎల్లప్పుడూ మనస్సును అదుపులో వుంచుకొని సరైన జ్ఞానంగలిగి ప్రవర్తించే వాని ఇంద్రియాలు సారధియొక్క మంచి గుర్రాల వలె తన వశంలో ఉంటాయి.
సరైన జ్ఞానంలేక చెదిరిపోయిన మనస్సుతో ఎల్లపుడు అశుచిగా ఉండేవాడు ఆ గమ్యాన్ని పరమ పదాన్ని ఎన్నటికి పొందలేడు. అంతేగాక జననమరణ చక్రరూపమైన సంసారంలో పడిపోతాడు.
కానీ ఎవడైతే విజ్ఞానవంతుడో వశముచేసుకొన్న మనస్సు గలవడో సదా పరిశుద్దుడో అతడు పునర్జన్మలేని ఆ పరమపదాన్ని చేరుకుంటాడు.
బుద్ధే సారధిగాగలవాడు మనస్సే చాకచక్యంతో పట్టుకోబడిన కల్లెమైనవాడు అయిన మానవుడు ప్రయాణపు గమ్యమైన విష్ణువుయొక్క పరమపదాన్ని(సర్వవ్యాపక పరమాత్మ అయిన పరంధామున్నే) చేరుకుంటాడు.
ఇంద్రియములకంటె పదార్థములు గొప్పవి. పదార్తములకంటె మనస్సు గొప్పది. మనస్సు కంటె బుద్ధి గొప్పది. బుద్ధి కంటే మహత్తరమగు ఆత్మ (హిరణ్యగర్భుడు) గొప్పది. మహత్తరమైన ఆత్మ కంటె అవ్యక్తము గొప్పది. అవ్యక్తముకంటె పురుషుడు (పరమాత్మ) గొప్పవాడు. పురుషునికంటె గొప్పది మరి ఏదియులేదు. అదియే అన్నిటికిని పరాకాష్ట. అదియే పరమగమ్యము. 
సమస్త ప్రాణులందును నిగూడముగా నుండుటచే ఈ ఆత్మ అందరకును కనుపించుట లేదు. కాని సూక్ష్మదర్శులు వారికి తమ సూక్ష్మబుద్దిచే ఈ ఆత్మ కనుపించుచున్నది. 
ప్రజ్ఞావంతుడు వాక్కును మనస్సునందు, మనస్సును బుద్దియందును, బుద్దిని మహాదాత్మయందును, మహాదాత్మను శాంతమగు అత్మయందును నిమగ్నము చేయవలెను.
లెమ్ము! మేలుకొనుము. ఉత్తములగు గురువులను సమీపించి ఆత్మనుగూర్చి తెలిసికొనుము. ఆ మార్గము కత్తియొక్క పదనైన అంచువలె దాటుటకు కష్టమైనదని పెద్దలు చెప్పుదురు. 
శబ్దస్పర్శ రూపగంధాలు లేనిది నాశరహితమైనది శాశ్వతము ఆదీ అంతు లేనిదీ మహాత్తుకు అతీతమైనిది ద్రువమైనది అయిన ఆత్మను ఎవరు హృదయంలో సాక్షాత్కరించుకుంటారో అట్టి మానవుడు మ్రుత్యువునుండి విముక్తి పొందుతాడు.
స్వతః సిద్దుడు స్వయంగా ఆవిర్భవించినవాడు అయిన భగవంతుడు ఇంద్రియాలను దోషపురితలుగా సృష్టించాడు. అందుచేత అవి బయటి విషయాలవైపు మాత్రమే పోగలవు. లోపల ఉన్న ప్రత్యగాత్మను అవి దర్శించలేవు. ప్రయత్నముతో ఎవరో ఒక ధీరుడు అమృతత్వాన్ని కోరి తన కళ్ళను లోపలి మరల్చుతాడో అట్టి వాడు మాత్రమే అంతరాత్మను దర్శిస్తాడు.
పసిబాలురు(అజ్ఞానులు) బహ్యసుఖాల వెంటపడతారు. అలా వారు అపారమైన మృత్యువు వలలో పడిపోతారు. కానీ ప్రాజ్ఞులు ఏ అనిత్య విషయాలమద్య నిత్యమూ శాశ్వతము అమరము అయిన దేదో తెలుసుకొని ఈ ప్రపంచంలో దేనిని కూడా కోరరు.
స్వప్నావస్థలో జాగ్రదావస్థలో అన్ని విషయాలను ఏ ఆత్మ ద్వార తెలియబడుచున్నవో, అట్టి సర్వవ్యాపియగు మహత్తరమైన అయిన ఆత్మను సాక్షాత్కరించుకొని ప్రాజ్ఞుడు ఇక దుఃఖించడు.  
తేనెను అస్వాదిస్తున్నది జీవితాన్ని పోషిస్తున్నది భూతభవిష్యత్తులకు ప్రభువు అయిన ఆత్మను చాల దగ్గరగా తెలుసుకున్నవాడు ఆ తరువాత ఇక భయం చెందడు .
పూర్వం జ్ఞానానికి జన్మించినవాడు నీటికంటే ముందుగ వున్నవాడు అయిన ఆత్మ అది హృదయంలో ప్రవేశించి పంచాభుతలతో ఉంటున్నదని దర్శించినవాడు నిజంగా బ్రహ్మన్నే దర్శిస్తాడు.
ప్రాణరూపంగా కనబడేది పంచాభుతలతో సృస్టించబడినది హృదయంలో ప్రవేశించి నివసించేది అయిన ఆత్మని పరమాత్మగా తెలిసికోన్నవాడే నిజంగా బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు.
ఏది (ఏ ఆత్మ) ఇచట (ఈ లోకమున) ఉన్నదో, అదియే అచటను (పరలోకమునను) కలదు. ఏది అచట కలదో, అదియే ఇచ్చతను ఉన్నది. ఇచట భేదబుద్ది ఎవనికి కన్పించునో, అతడు మాటిమాటికి మృత్యువును పొందును.

మనస్సు ద్వారానే దీని సాక్షాత్కరించుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏ వైవిధ్యము వుండదు. ఇక్కడ వైవిద్యం వున్నట్లు చూచే వాడు మరణాన్నుంచి మరణానికి పోతువుంటాడు. అట్టివానికి జనన మరణాలు తప్పవు.
బొటనవ్రేలి పరిమాణంగల పురుషుడు ఈ శరీరంలో నివసిస్తూ వుంటాడు. భూత భవిష్యత్తులకూ ఆయనే ప్రభువు. ఇది తెలిసి మానవుడు భయపడడు. భూత భవిష్యత్తులకు అధిపతియగు పురుషుడు పొగలేని అగ్నివంటివాడు, ఈనాడు, రేపుగూడ భేదారహితుడైన ఇతడే కలడు. ఇతడే ఆ ఆత్మ.
నచికేతా! నిర్మలమగు జలము నిర్మలమగు జలమందు పడి దానితో ఏకమగునట్లు జ్ఞానముకల మునియొక్క ఆత్మకూడ బ్రహ్మమే యగుచున్నది. 
జన్మరహితుడు అకుంటిత ప్రజ్ఞావంతుడు అయిన ఆత్మకు పదకొండు ద్వారాలుగల పట్టణం వున్నది. ఆ ఆత్మను ధ్యానించిన వానికి దుఃఖము లేదు. అన్ని అజ్ఞానబంధాలనుండి విముక్తుడై జన్మమ్రుత్యుబంధనాలనుండి కూడా స్వేఛ్చ పొందుతాడు. 
శరీరంలో నివసించేవానికి చెందినది. శరీరంనుండి అతడు వేరు చేయబడిన తరువాత ఇక్కడ ఏది మాత్రం మిగులుతుంది ? ఇది నిజంగా ఆ ఆత్మ. మనవులెవరు ప్రాణం చేతగాని అపానం చేతగాని జీవించడు. ఈ రెండూ ఆధారపడి వుండే మరొక దానిచేత జీవిస్తాడు , అదే ఆత్మ.
సమస్తమును తన వశమందుంచుకొని సమస్త ప్రాణులకును అంతరాత్మ అయియున్న ఆత్మ తన ఏకైక రూపమును అనేకవిధములుగా భాసింపచేయుచున్నది. తన అత్మయందలి ఈ తత్త్వమును దర్శించు జ్ఞానులకు మాత్రమే శాశ్వతసుఖము కలుగుచున్నది.  
ఓ గౌతమా ఇక నీకు ఆ రహస్యము సనాతనము అయిన బ్రహ్మాన్ని గూర్చి చెబుతాను. అలాగే చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను.
కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్బంలో ప్రవేసిస్తాయి. మరీ కొన్ని జీవాత్మలు చెట్టు చేమలనాశ్రయిస్తాయి. అంటే వారి కర్మ ననుసరించి జ్ఞానాన్ని అనుసరించి వుంటుంది.  
అనిత్య వస్తువులలో నిత్యవస్తువు చైతన్యవంతమైన వానిలోను చైతన్యము ఒక్కటే అయినా అనేకుల కోరికలు నేరవేర్చేది అయిన పరమాత్మను తమ అత్మయందే స్తితమై వున్న దానినిగా ఏ ప్రాజ్ఞులు దర్సిస్తారో వారిదే శాశ్వతమైన శాంతి. ఇతరులది కాదు.
నిజంగా అవ్యక్తనికంటే మించినది సర్వవ్యాపి సర్వ లక్షణ రహితము అయిన పురుషుడే. ఆ పురుషుని సాక్షాత్కరించుకోవడం చేత మానవుడు ముక్తుడై అమరుడవుతాడు.
అతని రూపం చూపు మేరలోలేదు. కన్నులతో ఎవడు అతనిని చూడలేదు. హృదయంలో వుంది మనస్సును శాసించే బుద్ధి యొక్క స్పుర్తిచేతనే అతడు ప్రకటితమవుతాడు. అతనిని తెలుసుకున్నవారు అమరులవుతారు.
మనస్సుతోసహా పంచేద్రియాలు ఎప్పుడు ఆత్మలో నిశ్చలంగా నిలిచిపోతాయో బుద్ధి కూడా ఎప్పుడు నిశ్చలమైపోతుందో అప్పటి స్తితినే పరమపదమని అంటారు.
స్థిరమగు ఇంద్రియధారణనే యోగమని యెంచెదరు. అట్టి స్థితియందు యోగి అప్రమత్తుడై యుండవలెను. ఈ యోగమును పొందవచ్చును. అజాగ్రత్తచే పోగొట్టుకొనవచ్చును.
శాశ్వతమైన ఆత్మే సత్తు అదే అసలు తత్వంగా సాక్షాత్కరించుకోవాలి. అలా ఆత్మను హృదయంలో సాక్షాత్కరించుకున్నవానికి అసలు తత్వం ప్రత్యక్షమవుతుంది.
హృదయంలో దాగివున్న సకల వాంఛలు నిర్ములించబడినపుడు మరనసీలియైన మానవుడు అమరుడవుతాడు. ఈ శరీరం ఉండగానే బ్రహ్మ ప్రాప్తిని పొందుతాడు.హృదయ గ్రందులన్నియు ఎపుడు చేధింపబడునో అపుడు మనుజుడు అమ్రుతుడగుచున్నాడు .
నిర్దేశింప శక్యము గానిదియు, పరమమైనదియు నగు సుఖమును ఇదియే ఆ ఆత్మ అని విజ్ఞులు భావింతురు.
అక్కడ (ఆ ఆత్మయెద్ద) సుర్యుడుకాని, చంద్రుడు కాని, నక్షత్రములు కాని, మెరుపులు కాని ప్రకాశింపవు. ఇక ఈ అగ్ని విషయము వేరుగా చెప్పవలయునా! ఆ ఆత్మ ప్రకాశించుటవలననే దానిని ఆశ్రయించుకొని తక్కినవన్నియు ప్రకాశించుచున్నవి. దాని ప్రకాశముచే ఇదియంతయు ప్రకాశించుచున్నది. 
ఈ ఆత్మయొక్క భయమువలననే అగ్ని మండుచున్నది, సూర్యుడు ప్రకాశించుచున్నాడు, ఇంద్రుడు, వాయువు, ఐదావవాడగు మృత్యువు తమ తమ విధులను చక్కగా నిర్వర్తించుచున్నారు.
శరీరము పడిపోవక పూర్వమే ఈ ఆత్మను తెలికొనువాడు సంసారబందమునుండి విముక్తుడగుచున్నాడు. అట్లు తెలిసికోననిచో అతడు మరల శరీరమును ధరింపవలసివచ్చును(పునర్జన్మను పొందవలసివచ్చును).

అంతరాత్మ అయిన పురుషుడు బొటన వ్రేలంతవాడు సర్వదా ప్రాణుల హృదయాలలో నివసిస్తువుంటాడు. ముంజగడ్డినుండి దర్భను వేరుచేయునట్లు మనుజుని శరీరంనుండి అతన్ని(ఆత్మను) లోపలి పోచనులాగ వేరుచేయాలి. అతడే పరిశుద్దుడు అమరుడు అని తెలుసుకోవాలి. అవును అతడే పరిసుద్దుడు అమరుడు.