Sunday, December 1, 2013

2.కేనోపనిషత్తు :


ఓం నమో పరమాత్మయే నమః 

శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యుద్వాచో
హవాచం స ఉ ప్రాణస్య ప్రాణః
చక్షుషశ్చక్షు రతిముచ్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకాదమమృతా భవన్తి.
ఏది శ్రోత్రమునకు శ్రోత్రమో, మనస్సునకు మనస్సో, వాక్కునకు వాక్కో, ప్రాణమునకు ప్రాణమో, నేత్రమునకు నేత్రమో అదియే (అధిష్టాన) పరబ్రహ్మము. ధీరులగువారు ఈ జగద్బ్రాంతిని విడిచి ఈ లోకమునుండి (శరీరమునుండి) వెలువడి జననమరణ రహితులు అగుచున్నారు.
స త త్ర చక్షుర్గచ్చాతి న వాగ్గచ్చతి నో మనో
న విద్మో న విజానీయో యథైతదను   శిష్యా
దన్యదేవ తద్విదితాదథొ అవిదితా దధి
ఇతి శుశ్రుమ పూర్వేషాం యే న స్తద్వ్యాచచక్షిరే
ఆ బ్రహ్మము నోద్దకు నేత్రము పోవుటలేదు. వాక్కు పోవుటలేదు. మనస్సు పోవుటలేదు. కాబట్టి దానిని (భౌతిక వస్తువును వలె) ఎరుగలేము. ఏ ప్రకారము ఈ బ్రహ్మమును ఇతరునకు చెప్పనగునో తెలియలేము. ఆ బ్రహ్మము తెలియబడు ప్రపంచముకంటే వేరుగానే యున్నది. మరియు తెలియబడని అవ్యాకృతము కంటెను ఉత్తమమైనది. ఈ ప్రకారము ఏ ఆచార్యులు ఆ బ్రహ్మము గూర్చి మాకు చెప్పిరో, ఆ పుర్వచార్యుల వాక్యములను మేము వినుచున్నాము.
యన్మనసాన మనుతే యెనాహుర్మానో మతమ్
తదేవ బ్రహ్మ త్వం విడి నేదం యదిదముపానతే |
ఏది మనస్సుచేత మననము చేయబడజాలదో, దానిచేత మనస్సు మననశక్తి గలదిగా చెప్పుదురో దానినే నీవు బ్రహ్మముగా నేరుగుము. ఏ యీ (అధ్యస్తమగు) మనస్సును, దాని అధిదేవతను జనులు ఉపాసించుచున్నారో, ఇది బ్రహ్మము కాదు.  
యస్యామతం తస్య మతం మతం యస్య న వేద సః ,
అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవిజానతామ్ |
ఎవరు బ్రహ్మమును తెలిసికొనబడజాలనిదిగ ఎరుంగునో అతడు బ్రహ్మమును గూర్చి తెలిసికొనినవాడు. ఎవడు బ్రహ్మమును (భౌతికవస్తువు వలె) తెలిసికొంటినని ఎరుంగునో అతడు బ్రహ్మము నేరుంగనివాడే యగును. కాబట్టి (ఒకానొక దృశ్య పదార్థమును నలె) బ్రహ్మమును తెలిసికోనినామని తలంచువారు ఏమియు తెలియనివారనయు, బ్రహ్మమును (ద్రుశ్యవస్తువునువలె) తెలిసికొనజాలమని ఎరుగువారు తెలిసికొనినవారనియు ఎరుగవలయును.            
ఇహ చెదవేది దథ సత్య మస్తి
న చేదిహావేది న్మహతీ విసష్టి: ,
భూతేషు భూతేషు విచిత్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకా దమృతా భపన్తి.
ఈ మనుష్య  జన్మయందు పరమాత్మను గూర్చి తెలిసికొనినచో, అతనికి సత్యమైన బ్రహ్మానందము సిద్దించుచున్నది, ఆ ప్రకారముగా ఈ జన్మయందు భగవంతుని గూర్చి తెలిసికొననిచో, గొప్ప వినాశము సంభవించుచున్నది. ధీరులగువారు సమస్తభూత కోట్ల యందును అద్వితీయాత్మ తత్వమును తెలిసికొని ఈ లోకము నుండి (శరీరము నుండి) వేరై జనన మరణ రహితులగుచున్నారు. 

1.ఈశావాస్యోపనిషత్తు :


ఓం నమో ప్రమత్మాయే నమః 

ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్,
తేన త్యక్తేన భుఇజ్ఞధా మాగృధః కస్య స్విద్దనమ్ |
ఈ చరాచర ప్రపంచమంతయు పరమేస్వరునిచే (పరమాత్మచే) వ్యాపించబడింది.త్యాగభావముతో అనుభవింపుము. ఇతరుల ధనాదులను కొరకుము.
అసుర్యా నామ తే లోకా అన్దేన తమసావృతాః
తాంస్తే ప్రేత్యాభిగచ్చన్తియే కే చాత్మహనోజనః |
అసుర సంబంధములగు లోకములు అజ్ఞానరూపమున అంధకారముచే వ్యాపింపబడియున్నవి. ఆత్మజ్ఞానము లేనివారు అట్టి అసుర లోకములందే జన్మించుచుందురు.
తదేజతి తన్నెజతి తద్దూరె తద్వాన్తికే ,
తదస్తరస్య సర్యస్య తదు సర్వస్వాస్య బహ్యతః |
ఆత్మ దృశ్య పదార్థరూపమున చలించును. వాస్తవముగా (అధిస్థానదృష్టిచే) చలించదు. అజ్ఞానులకు అది దూరముగా నుండును. జ్ఞానులకు సమీపముగానే యుండును. ఆ యత్మ ఈ సమస్త జగత్తుయోక్క బాహ్యాభ్యంతరములందును గూడ వ్యాపించి యున్నది.
యస్తు సర్వాణి భుతన్యాత్మన్యేవాసుపశ్యుతి,
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే.|
ఎవడు సమస్త ప్రాణులను తన అత్మయందే చూచునో, అట్లే సమస్త ప్రాణులందును తన ఆత్మనే కాంచునో, అట్టివాడు (సర్వాత్మదర్శనము వలన) దేనిని ద్వేషింపడు.
యస్మిన్సర్వాణి భుతన్యాత్మేవాభూద్విజానతః ,
తత్ర కో మోహః కః శోక ఎకత్వమనుపశ్యతః |
ఎవడు సమస్త ప్రాణులను తన అత్మగానే తెలిసికొనునో, అట్టి ఏకత్వానుభూతిచే అతని కింక మోహ మెచట ? శోక మెచట ?
అన్ధం తమః ప్రవిశన్తియే విద్యాముపాసతే |
అవిద్యను ఆశ్రయించువారు అజ్ఞాన మను అంధకారమందే ప్రవేసించుదురు.
విద్యయా మృత మశ్నుతే |
అత్మజ్ఞానముచే మనజుడు అమ్రుతత్వమును (మోక్షమును) బొందుచున్నాడు.
హిరణ్మయేన సాత్రేణ సత్యస్యాపి హితం ముఖమ్ ,
తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ ద్రుష్టయే .|
ఓ పరమాత్మ! బంగారుపాత్రచే (మొహకరములగు పదార్తములచే) సత్యము యొక్క స్వరూపము కప్పబడియున్నది. కాబట్టి సత్య, ధర్మముల సాక్షాత్కారము కొఱకై అద్దానిని (ధనాద్యపేక్షను) తొలగింపుము.
అగ్నే నయ సుపధా రాయే అస్మాన్విశ్వాని దేవ వయునాని విద్వాన్ ,
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టం తే నమ ఉక్తిం విధేమ |
ఓ అగ్నిదేవా! నన్ను సన్మార్గమునకు తీసికొని పొమ్ము. నీవు సమస్త జ్ఞానమునకు, మా కర్మలను తెలిసికొనియున్న వాడవు.మా పాపములను నశింపజేయుము. దానివలన మేము పరిశుద్దులమగుదుము. మేము ణీ యొక్క ఉత్తమ స్తోత్రమును భక్తితో చేయుదుము.

108 ఉపనిషత్తులు:


ఓం నమో పరమాత్మయే నమః 
ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న 108 ఉపనిషత్తులు


S.No
Name of the Upanishattu
P.No

S.No
Name of the Upanishattu
P.No
1
ఈశావాస్యోపనిషత్తు


55
రామతాపిన్యుపనిషత్తు

2
కేనోపనిషత్తు


56
వాడుదేవోపనిషత్తు

3
కఠోపనిషత్తు


57
ముద్దలోపనిషత్తు

4
ప్రశ్నోపనిషత్తు


58
శాండిల్యోపనిషత్తు

5
ముండకోపనిషత్తు


59
పైజ్గలోపనిషత్తు

6
మాండుక్యోపనిషత్తు


60
భిక్షుకోపనిషత్తు

7
తైత్తిరీయోపనిషత్తు


61
మహొపనిషత్తు               

8
ఐతరేయోపనిషత్తు


62
శారీరకోపనిషత్తు

9
ఛాందోగ్యోపనిషత్తు


63
యోగశిఖోపనిషత్తు

10
బృహదారణ్యకోపనిషత్తు


64
తురీయాతీతోపనిషత్తు

11
బ్రహ్మొపనిషత్తు


65
సన్యాసోపనిషత్తు

12
కైవల్యోపనిషత్తు


66
పరమహంసపరివ్రాజకోపనిషత్తు

13
జాబాలోపనిషత్తు


67
అక్షమాలికోపనిషత్తు

14
శ్వేతాశ్వతరోపనిషత్తు


68
అవ్యక్తోపనిషత్తు

15
హంసోపనిషత్తు


69
అన్నపుర్ణోపనిషత్తు

16
అరుణికోపనిషత్తు


70
సూర్యోపనిషత్తు

17
గర్భోపనిషత్తు


71
ఏకాక్షరోపనిషత్తు

18
నారాయణోపనిషత్తు


72
అక్ష్యుపనిషత్తు

19
పరమహంసోపనిషత్తు


73
ఆధ్యాత్మోపనిషత్తు

20
అమ్రుతబిందూపనిషత్తు


74
కుండికోపనిషత్తు

21
అమృతనాదోపనిషత్తు


75
సావిత్ర్యుపనిషత్తు

22
అధర్వశిరోపనిషత్తు


76
ఆత్మోపనిషత్తు

23
అధర్వశిఖోపనిషత్తు


77
పాశుపతబ్రహ్మొపనిషత్తు

24
మైత్రాయణ్యుపనిషత్తు


78
పరబ్రహ్మొపనిషత్తు

25
కౌషీతకీబ్రాహ్మణోపనిషత్తు


79
అవధూతోపనిషత్తు

26
బృహజ్జాబాలోపనిషత్తు


80
త్రిపురాతాపిన్యుపనిషత్తు

27
నృసింహపూర్వతాషిన్యుపనిషత్తు-1
నృసింహపూర్వతాషిన్యుపనిషత్తు-2


81
దేవ్యుపనిషత్తు

28
కౌలాగ్నిరుద్రోపనిషత్తు


82
త్రిపురోపనిషత్తు

29
మైత్రేయోపనిషత్తు


83
కటరుద్రోపనిషత్తు

30
సుబాలోపనిషత్తు


84
భావనోపనిషత్తు

31
క్షురికోపనిషత్తు


85
రుద్రహృదయోపనిషత్తు

32
మన్త్రికోపనిషత్తు


86
యోగకుండల్యుపనిషత్తు

33
సర్వసారోపనిషత్తు


87
భస్మజాబాలోపనిషత్తు

34
నిరాలంబోపనిషత్తు


88
రుద్రాక్షజాబాలోపనిషత్తు

35
శుకరహస్యోపనిషత్తు


89
గణపత్యుపనిషత్తు

36
వజ్రసూచికోపనిషత్తు


90
దర్శనోపనిషత్తు

37
వేజోబిందూపనిషత్తు


91
తారాసారోపనిషత్తు

38
నాదబిందూపనిషత్తు


92
మహావాక్యోపనిషత్తు

39
ధ్యానబిందూపనిషత్తు


93
పంచబ్రహ్మొపనిషత్తు

40
బ్రహ్మవిద్యోపనిషత్తు


94
ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు

41
యోగాతత్వోపనిషత్తు


95
గోపాలతాషిన్యుపనిషత్తు

42
అత్మబోధోపనిషత్తు


96
కృష్ణోపనిషత్తు

43
నారదపరివ్రాజకోపనిషత్తు


97
యాజ్ఞవల్క్యోపనిషత్తు

44
త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు


98
వరాహోపనిషత్తు

45
సీతోపనిషత్తు


99
శాట్యాయనీయోపనిషత్తు

46
యోగాచూడామణ్యుపనిషత్తు


100
హయగ్రీవోపనిషత్తు

47
నిర్వాణోపనిషత్తు


101
దత్తత్రేయోపనిషత్తు

48
మండలబ్రాహ్మణోపనిషత్తు


102
గారుడోపనిషత్తు

49
దక్షిణామూర్త్యుపనిషత్తు


103
కలిసంతరనోపనిషత్తు

50
శరభోపనిషత్తు


104
జాబాల్యుపనిషత్తు

51
స్కన్దోపనిషత్తు


105
సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు

52
త్రిపాద్విభూతిమహానారాయణోపనిషత్తు


106
సరస్వతీరహస్యోపనిషత్తు

53
అద్వయతారకోణోపనిషత్తు


107
బహ్వ్రుచొపనిషత్తు

54
రామరహస్యోపనిషత్తు


108
ముక్తికోపనిషత్తు